iDreamPost
android-app
ios-app

ఈ బియ్యం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో!.. కిలో ఏకంగా రూ. 15 వేలు!

Japan kinmemai rice: బియ్యం ధరలు కిలోకు ఓ 40 రూపాయలు లేదా 100 ఉంటుంది. కిలో బియ్యం ధర వేలల్లో ఉంటుందని ఎప్పుడు విన్నది కూడా లేదు. కానీ ఆ దేశంలో మాత్రం కిలో బియ్యం ధర రూ. 15 వేలు.

Japan kinmemai rice: బియ్యం ధరలు కిలోకు ఓ 40 రూపాయలు లేదా 100 ఉంటుంది. కిలో బియ్యం ధర వేలల్లో ఉంటుందని ఎప్పుడు విన్నది కూడా లేదు. కానీ ఆ దేశంలో మాత్రం కిలో బియ్యం ధర రూ. 15 వేలు.

ఈ బియ్యం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో!.. కిలో ఏకంగా రూ. 15 వేలు!

ఆహార ధాన్యమైన బియ్యాన్ని ప్రపంచ దేశాల్లో పండించే వారున్నారు. ఎక్కువ మంది ఆహారంగా తీసుకునేది బియ్యంతో చేసిన ఆహార పదార్థాలే అనడంలో అతిశయోక్తి లేదు. మన దేశంలో కూడా వరి పంట ప్రధాన పంటగా పండించే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వరిలో చాలా రకాలు ఉన్నాయి. వరిలో ఎన్నో రకాల నూతన వంగడాలను శాస్త్ర వేత్తలు అభివృద్ధి పరిచారు. అధిక దిగుబడులను ఇచ్చే వరి రకాలను పండిస్తున్నారు. దేశంలో ఆహార కొరతను తీర్చేందుకు కృషి చేస్తున్నారు. బియ్యంలో చాలా రకాల వెరైటీస్ ను పండిస్తున్నారు రైతులు. సన్నరకాలు, దొడ్డు బియ్యం రకాలు, బాస్మతీ రైస్ ఇలా మార్కెట్ లో చాలా రకాల బియ్యాలు లభిస్తున్నాయి.

మనం ఎక్కువగా తెల్ల బియ్యాన్ని వినియోగిస్తుంటాం. బియ్యం రకాన్ని బట్టి రంగు, రుచి, పోషకాలు ఇలా ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. అయితే బియ్యం వాటి క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయన్న విషయం తెలిసిందే. రకాలను బట్టి క్వింటాల్ కు రూ. 6 వేల వరకు ఉంటుంది. కిలోల లెక్కన అయితే 50, 100, వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే బియ్యం ధర తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. అత్యంత ఖరీదైన బియ్యం ఇవే అని అనకమానరు. ఇంతకీ కిలో బియ్యం ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ. 15 వేలు. ఏంటీ కిలో బియ్యం ధర రూ. 15 వేలా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి బాబు.

ఇంతకీ ఈ బియ్యాన్ని ఎక్కడ పండిస్తున్నారో తెలుసా? జపాన్ దేశంలో ఈ బియ్యాన్ని పండిస్తున్నారు. జపనీయులు ఈ ఖరీదైన బియ్యాన్ని సాగు చేస్తున్నారు. జపనీస్ కిన్మెమై రైస్ కిలోకు రూ. 15 వేల ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్దతిని ఉపయోగించి దీనిని పండిస్తారు. ఈ ప్రిమియం రైస్ లో పోషకాలు పుష్టిగా ఉంటాయి. రుచి కూడా బాగుంటుందని చెబుతున్నారు. ఈ బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని వెల్లడిస్తున్నారు. ఈ ఖరీదైన బియ్యాన్ని జపాన్ వరల్డ్ వైడ్ గా ఎగుమతి చేస్తున్నది. ఈ బియ్యం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వారు.