iDreamPost
android-app
ios-app

Mahesh Babu: SSMB29.. మహేశ్ అసలు లుక్ ఇది కాదా? వేరే ఉందా? జక్కన్న ట్విస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

  • Published Sep 26, 2024 | 11:46 AM Updated Updated Sep 26, 2024 | 11:46 AM

SS Rajamouli no conditions on Mahesh Babu SSMB29: హీరోల లుక్ లు బయటకి రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండే రాజమౌళి.. మహేశ్ బాబుకు మాత్రం ఇంత ఫ్రీడం ఎలా ఇస్తున్నాడు? అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనకాల జక్కన్న ట్విస్ట్ తెలిస్తే.. దిమ్మతిరగడం ఖాయం. ఆ వివరాల్లోకి వెళితే..

SS Rajamouli no conditions on Mahesh Babu SSMB29: హీరోల లుక్ లు బయటకి రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండే రాజమౌళి.. మహేశ్ బాబుకు మాత్రం ఇంత ఫ్రీడం ఎలా ఇస్తున్నాడు? అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనకాల జక్కన్న ట్విస్ట్ తెలిస్తే.. దిమ్మతిరగడం ఖాయం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 26, 2024 | 11:46 AMUpdated Sep 26, 2024 | 11:46 AM
Mahesh Babu: SSMB29.. మహేశ్ అసలు లుక్ ఇది కాదా? వేరే ఉందా? జక్కన్న ట్విస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

అగ్రదర్శకుడు SS రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే.. ఆ సినిమా గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో మనందరికి తెలిసిందే. హీరోల లుక్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకుంటాడు. ఇక జక్కన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి సదరు హీరో బయట కనిపించడం తగ్గిపోతుంది. ఎందుకంటే? లుక్ రివీల్ అవుతుందని రాజమౌళి ఆలోచన. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. అంతెందుకు ఆర్ఆర్ఆర్ మూవీ టైమ్ లో రామ్ చరణ్ ఆచార్య మూవీలో నటించడానికి స్వయంగా కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి జక్కన్నను రిక్వెస్ట్ చేశారు. దాంతో ఆయన కాదనలేకపోయారు. అంత ఫర్ ఫెక్ట్ గా ఉండే రాజమౌళి.. SSMB29 విషయంలో మహేశ్ కు ఇంత ఫ్రీడం ఇవ్వడం ఏంటి? అని కొందరిలో సందేహాలు తలెత్తాయి. అయితే దీని వెనక ఉన్న అసలు విషయం తెలిస్తే.. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది.

సాధారణంగా రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుందంటే.. అంతకు ముందు కొన్ని నెలల నుంచే ఆ సినిమా హీరో బయట కనిపించడం తగ్గిపోతుంది. హీరో లుక్ రివీల్ అవుతుందని జక్కన్న ఆలోచన. కానీ.. SSMB29 మూవీలో మహేశ్ కు మాత్రం ఈ కండిషన్లు లేవు. సూపర్ స్టార్ స్వేచ్ఛంగా ఫంక్షన్లకు, బయటకు తిరుగుతూ ఉన్నాడు. దాంతో ప్రిన్స్ లుక్స్ కి ఫ్యాన్స్ పిచ్చెెక్కిపోతున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మీసకట్టుతో మహేశ్ ను ఇప్పటి వరకు చూడని విధంగా తయ్యారు చేసి.. మహేశ్ తో జక్కన్న గట్టిగానే కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ప్రిన్స్ లుక్ విషయంలో ట్విస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు మనందరం చూసే మహేశ్ న్యూ లుక్ నిజమైంది కాదట, సినిమాలో వేరే విధంగా కనిపిస్తాడని తెలుస్తోంది.

SSMB29 మూవీ కోసం మహేశ్ బాబు హాలీవుడ్ హీరోలా మారుతున్నాడు. ఇక ఈ లుక్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. కానీ.. ఇక్కడే రాజమౌళి ఓ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మనం ప్రస్తుతం చూస్తున్న లుక్ లో మహేశ్ కనిపించడట. అసలు జక్కన్న స్కెచ్ ఏంటంటే? మహేశ్ జట్టు, గడ్డం పెంచిన తర్వాత విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్ట్ లను రాజమౌళి పిలిపించి.. ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ లో ఓ ఫోటో షూట్ చేయించి.. ఆ తర్వాత తనకు కావాల్సిన 4 లేదా 5 లుక్ లను డిజైన్లు చేయించడానికి రెడీ అవుతున్నాడు. ఈ గెటప్పుల్లో జక్కన్నకు బెస్ట్ అనిపించిన లుక్ ను ఫైనల్ చేసి.. ఆ మేకోవర్ కు మహేశ్ ను తీసుకొస్తారు. అప్పటి నుంచి సూపర్ స్టార్ బయటకనిపించడం తగ్గిపోతుంది. ఒకవేళ ఎమర్జెన్సీగా బయటకి రావాల్సి వస్తే.. టోపీ లేదా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాసెస్ జరగడానికి ఇంకో రెండు, మూడు నెలల టైమ్ పడుతుంది. అందుకే మహేశ్ ఇంత ఫ్రీగా తిరుగుతున్నాడు. ఇది తెలియని అభిమానులు ఇదే మహేశ్ అసలు లుక్ అని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఇది నిజమో.. కాదో.. తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss