iDreamPost
android-app
ios-app

SS Rajamouli: 200 క్యారెక్టర్లతో SSMB29.. జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్ మన ఊహకందదు!

  • Published Sep 16, 2024 | 11:20 AM Updated Updated Sep 16, 2024 | 11:24 AM

200 unique characters in ssmb29, SS Rajamouli, Mahesh Babu: మహేశ్ - రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ మూవీలో ఏకంగా 200 యూనిక్ క్యారెక్టర్లు ఉండబోతున్నాయట. ఆ వివరాల్లోకి వెళితే..

200 unique characters in ssmb29, SS Rajamouli, Mahesh Babu: మహేశ్ - రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ మూవీలో ఏకంగా 200 యూనిక్ క్యారెక్టర్లు ఉండబోతున్నాయట. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 16, 2024 | 11:20 AMUpdated Sep 16, 2024 | 11:24 AM
SS Rajamouli: 200 క్యారెక్టర్లతో SSMB29.. జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్ మన ఊహకందదు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ SSMB29. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికంటే ముందే.. భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ.. బయటకి వస్తున్న వార్తల గురించి వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించిన ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు జక్కన్న చేసిన సినిమాలు ఒకలెక్క.. ఈ సినిమా మరో లెక్క అని తెలుస్తోంది. ఆపరేషన్ హాలీవుడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 200 యూనిక్ ట్రైబల్ క్యారెక్టర్లు ఉండబోతున్నట్లు సమాచారం.

SSMB29.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా. మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. తాజాగా అలాంటి న్యూసే మరోటి భయటకి వచ్చింది. ఈ చిత్రంలో 200 యునిక్ క్యారెక్టర్లు ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే 1800 ఏళ్ల కాలంలో జరిగే పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఆ కాలంలో ఉన్న కొన్ని గిరిజన తెగల గురించి కూడా ఇందులో చూపించబోతున్నారు. ఆఫ్రికాలోని అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరల్ డ్రామాగా SSMB29 నిర్మాణం జరుపుకొంటోంది. కాగా.. ఈ 200 మంది  యూనిక్ క్యారెక్టర్ల కోసం నటీ, నటులను ఎంపిక చేసే పనిలో ప్రొడక్షన్ టీమ్ ఉన్నట్లు సమాచారం.

అయితే.. జక్కన్న 200 మంది నటీ, నటులతో మూవీ ప్లాన్ చేస్తున్నాడంటే.. ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాడు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుతం బయటకి వస్తున్న వివరాలు చూస్తుంటే.. మనం ఊహించిన దానికంటే భారీ రేంజ్ లోనే జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ శాతం ఆఫ్రికా అడవుల్లోనే జరగనుంది. ఇక మేకర్స్ ఈ మూవీ గురించి చిన్న లీక్ కూడా బయటకి రాకూండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే ఈ చిత్రం కావడంతో.. దానికి మించి ఉండేలా మహేశ్ మూవీని రూపొందించాలని భావిస్తున్నాడు. అందుకే ఈ మూవీని చెక్కుతున్నాడు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా వర్స్ షాప్ ను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వర్క్ షాప్ లో కీలక పాత్రలు పోషించబోయే నటీ, నటులు కూడా పాల్గొంటున్నట్లు వినికిడి. ఇక SSMB29లో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా.. SSMB29లో 200 క్యారెక్టర్లు ఉంటాయన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş