iDreamPost
android-app
ios-app

SS Rajamouli: SSMB29.. మహేశ్ న్యూ లుక్ వెనక రాజమౌళి పెద్ద స్కెచ్! జక్కన్న పిచ్చోడేం కాదు..

  • Published Sep 24, 2024 | 12:06 PM Updated Updated Sep 24, 2024 | 12:06 PM

SSMB29 Movie, SS Rajamouli, Mahesh Babu New Look: SSMB29 మూవీలో మహేశ్ బాబు న్యూ లుక్ వెనక రాజమౌళి భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

SSMB29 Movie, SS Rajamouli, Mahesh Babu New Look: SSMB29 మూవీలో మహేశ్ బాబు న్యూ లుక్ వెనక రాజమౌళి భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Sep 24, 2024 | 12:06 PMUpdated Sep 24, 2024 | 12:06 PM
SS Rajamouli: SSMB29.. మహేశ్ న్యూ లుక్ వెనక రాజమౌళి పెద్ద స్కెచ్! జక్కన్న పిచ్చోడేం కాదు..

SS రాజమౌళి.. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తన సినిమాలతో టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత జక్కన్న సొంతం. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు తో తెరకెక్కించబోయే SSMB29 మూవీతో హాలీవుడ్ గేట్లు బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకోసం తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే ఈ సినిమా కోసం మహేశ్ బాబు మేకోవర్ అయిన న్యూ లుక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దాంతో ప్రిన్స్ లా ఉండే మహేశ్ ను జక్కన్న ఏంటి ఇలా చూపిస్తున్నాడు.. పిచ్చిగానీ పట్టిందా ఏంటి? అని కొంత మంది సోషల్ మీడియా వేదికగా రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. కానీ.. సూపర్ స్టార్ న్యూ లుక్ వెనక జక్కన్న పెద్ద స్కెచ్ ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు మనందరికి క్లీన్ షేవ్ తో నీట్ గా మిల్క్ బాయ్ లాగా కనిపించాడు. ప్రిన్స్ అంటే ఎలా ఉండాలో.. ఉంటాడో చూపించాడు. కానీ.. రాజమౌళి సినిమా కోసం ఒక్కసారిగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, మీసం కట్టుతో కనిపించి, ఒక్కసారిగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ మెుత్తాన్ని షాక్ కు గురిచేశాడు. ఇక సూపర్ స్టార్ నుంచి ఈ రేంజ్ మేకోవర్ ఊహించని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దాంతో మహేశ్ తో రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అంటూనే ఈ సినిమా ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది. కథ ఇది.. ‘జాన్ విక్’ లాంటి హాలీవుడ్ సినిమాలతో పోల్చుతూ .. వారికి నచ్చినట్లు కొందరు సోషల్ మీడియా వేదికగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. దాంతో పాటుగా ప్రిన్స్ లా ఉండే మహేశ్ ను ఇలా మర్చేశాడు ఏంటి? అంటూ రాజమౌళికి సినిమా పిచ్చిగాని ఎక్కువైందా?  అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. SSMB29లో మహేశ్ లుక్ వెనక జక్కన్న పెద్ద స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ గేట్లను టచ్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు మహేశ్ తో ఆ గేట్లను బద్దలు కొట్టి.. హాలీవుడ్ కు టాలీవుడ్ స్టామినాను పరిచయం చేసే పనిలో ఉన్నాడు. గతంలో కొందరి హీరోల చేయి పట్టుకుని మరీ బాలీవుడ్ ను మార్కెట్ ను షేక్ చేసిన ఘతన జక్కన్న సొంతం. ఇక ఇప్పుడు మహేశ్ తో బాలీవుడ్ కాదు.. ఏకంగా హాలీవుడ్ ను షేక్ చేయడానికి అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాడు. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ అనే బాణాన్ని ప్రపంచ సినిమాపై వదులుతున్నాడు. అయితే రాజమౌళి తెరకెక్కించే ఈ చిత్రాన్ని జాన్ విక్ తో పోల్చుతున్నారు. కానీ.. జక్కన్న ఎవరో తీసిన సినిమాలు కాపీ కొట్టేంత పిచ్చోడేం కాదు. పైగా ఆయన తెరకెక్కించే సినిమాలు మనం ఊహించను కూడా ఊహించలేం. ఆ రేంజ్ లో జక్కన్న టేకింగ్ ఉంటుంది. టాలీవుడ్ రేంజ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్న రాజమౌళిపై ఇలాంటి కామెంట్స్ చేస్తూ.. ఆయనను తగ్గించే ప్రయత్నం చేయెుద్దు. అధికారిక ప్రకటనలు రాకముందే.. రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టొందు అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş