iDreamPost
iDreamPost
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 వచ్చి ఏడాదవుతోంది. రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. లొకేషన్లు ఫైనల్ చేయడంలో ఆలస్యంతో పాటు క్యాస్టింగ్ కు సంబంధించిన కాల్ షీట్లు దొరకడం చాలా కష్టంగా ఉందట. అందుకే తప్పక లేట్ ని భరిస్తూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్యా డబ్బింగ్ వెర్షన్ ప్రమోషన్ కోసం టీమ్ మొత్తం వెళ్లిపోయింది. బన్నీ సుకుమార్ రష్మిక మందన్న దేవిశ్రీ ప్రసాద్ తో సహా కీలక బృందం అక్కడే ఉండి పబ్లిసిటీ చేసే పనిలో బిజీగా ఉంది. రెస్పాన్స్ కూడా బాగానే ఉందని అక్కడి మీడియా రిపోర్ట్. పుష్ప 2కి ప్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చిన నేపథ్యంలో తొందరపడే ఉద్దేశంలో హీరో దర్శకుడు లేరు.
ఇదయ్యాక బన్నీ ఎవరితో చేతులు కలుపుతాడనే సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగలేదు. త్వరలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టితో చర్చలు జరపబోతున్నట్టు ముంబై టాక్. చెన్నై ఎక్స్ ప్రెస్, సింగం, సూర్యవంశీ లాంటి అవుట్ అండ్ అవుట్ మసాలా ఎంటర్ టైనర్స్ లో సిద్ధహస్తుడైన రోహిత్ తన తర్వాతి ప్రాజెక్టుల కోసం టాలీవుడ్ స్టార్ల మీద కన్నేశాడు. ఆ లిస్టులో ఆర్ఆర్ఆర్ ద్వయం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నప్పటికీ వాళ్లకున్న కమిట్ మెంట్స్ కి ఇప్పుడే అందుబాటులోకి రారని తెలుసుకుని ఫోకస్ బన్నీ మీద పెట్టాడు. పుష్పని మించిన కమర్షియల్ సబ్జెక్టు ఒకటి వినిపించబోతున్నట్టు తెలిసింది. ఓకే అవుతుందో లేదో చూడాలి.
పుష్ప మీద విపరీతంగా ఆధారపడిపోయిన అల్లు అర్జున్ దీనికోసమే మూడేళ్ళకు పైగా ఖర్చు చేయాల్సి రావడం ఫ్యాన్స్ కి కొంత నిరాశ కలిగించిన మాట వాస్తవం.దానికి తోడు స్టార్ డైరెక్టర్లందరూ రెండు మూడేళ్ళ దాకా బిజీగా ఉండటంతో ఇప్పటికిప్పుడు తనకు కమిటయ్యే వాళ్ళు లేరు. కొన్ని నెలల క్రితం సంజయ్ లీలా భన్సాలీని కూడా బన్నీ కలిశాడు. నా పేరు సూర్య ఫలితం దెబ్బకు స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చిన బన్నీ ఆ కారణంగానే అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అయ్యాక చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు. పుష్ప 2 ది రైజ్ బడ్జెట్ పరంగా కంటెంట్ పరంగా చాలా పెద్ద స్కేల్ లో జరగబోతోంది కాబట్టి కెజిఎఫ్ 2ని మించి ఫలితం ఆశిస్తున్నాడు