iDreamPost
android-app
ios-app

నిజంగా పెళ్లి చేసుకోవాలనుంది.. కానీ అందరూ కమిటెడే: అరియానా

  • Published Nov 15, 2023 | 4:29 PM Updated Updated Nov 15, 2023 | 4:29 PM

యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. రియాలిటీ షోలోకి అడుగు పెట్టి.. సింగంలా ఆడి పేరు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. ఇప్పుడు అభిమానులతో ముచ్చటించిన అరియానా.. తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్లు చేసింది.

యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. రియాలిటీ షోలోకి అడుగు పెట్టి.. సింగంలా ఆడి పేరు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. ఇప్పుడు అభిమానులతో ముచ్చటించిన అరియానా.. తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్లు చేసింది.

  • Published Nov 15, 2023 | 4:29 PMUpdated Nov 15, 2023 | 4:29 PM
నిజంగా పెళ్లి చేసుకోవాలనుంది.. కానీ అందరూ కమిటెడే: అరియానా

బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్ ముద్దుగుమ్మల్లో ఒకరు అరియానా గ్లోరీ. తొలుత యూట్యూబ్ ఛానల్స్‌లో వ్యాఖ్యాతగా అవతారం ఎత్తిన ఈ భామ.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్‌ సీజన్ 4లో సందడి చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటూ.. తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. తన ఫోటోలను పోస్టు చేస్తూ.. ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది ఈ భామ. ఫ్రెండ్స్, పార్టీలు, ఫంక్షన్స్, ఇతర షోస్‌ చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమౌతున్న తెలుగు మీడియం ఐ స్కూల్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న అరియానా.. ఆకట్టుకుంటోంది.

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్ స్టాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య వన్ మిలియన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా లెట్స్ మీ టాక్ అంటూ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు పలు ప్రశ్నలు ఎదురు కాగా, వాటికి తనదైన స్టైల్లో రిప్లైలు ఇచ్చింది ఈ బ్యూటీ. ‘ఆర్ యు డేటింగ్ ఎనీవన్’ అన్న ప్రశ్నకు చిరునవ్వుతో లేరన్నట్లుగా సమాధానం ఇచ్చింది. థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను ఫాలో అయ్యాను.. ఓ సారి రిప్లై ఇవ్వొచ్చుగా అని ఓనెటిజన్ పేర్కొనగా.. ఇప్పుడు రిప్లై ఇచ్చాను సంతోషంగా ఉందా గురువు గారు అంటూ రిప్లైలో పేర్కొంది. తన ఫేవరేట్ ప్లేస్ ఇల్లే అని, అయితే ఎక్కువ సేపు గడపలేనని, బోర్ కొడుతుందని చెప్పారు. స్విట్జర్లాండ్ వెళ్లాలని కొన్ని రోజులు ఉండాలని కోరిక అని మనస్సులో మాట చెప్పింది.

Ariyana glory about her marriage

టాలీవుడ్ ఇలియానా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సిగ్గుల మొగ్గైంది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు ‘యాక్చువల్‌గా నాకు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ అబ్బాయిలు ఇప్పుడు ఖాళీ లేరు. ఏదో ఒక లాగా కమిట్ అయ్యారు. దేశ జనాభాలో మనం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు అబ్బాయిలు తగ్గిపోయారు. ఉన్నవాళ్లంతా కమిటెడే ఉన్నారు. ఎవర్మి ముట్టుకో పాపమే..ఎవర్నీ తగులుకో పాపమే 2 ఇయర్స్ లవ్ స్టోరీ, టెన్ ఇయర్స్ లవ్, 11 ఇయర్స్ ప్రేమ కథలే. అయ్యో ఇవన్నీ వదిలేసి.. వీడెవడో సింగిల్‌గా ఉన్నాడని పరిచయం చేసుకుంటే.. 2-3 డేస్‌లో తెలిసిపోతుంది వీడు కూడా కమిటెడే అని. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి అవుతుందంటారా..? ఎవరో గట్టిగా కోరుకుంటున్నాడు.. నా లైఫ్ లోకి రావాలని. వాడు రావట్లేదు. నేను వేరే వాళ్లకి కమిట్ అవ్వలేకపోతున్నా.ఏంటో’ అని రిప్లై ఇచ్చింది ఈ భామ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet