iDreamPost
android-app
ios-app

మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ – బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్?

  • Published Mar 07, 2024 | 1:48 PM Updated Updated Mar 07, 2024 | 1:48 PM

Raviteja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక శుభవార్త రానుంది. త్వరలోనే ఆయన తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఓ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాలో నటించనున్నరనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

Raviteja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక శుభవార్త రానుంది. త్వరలోనే ఆయన తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఓ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాలో నటించనున్నరనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

  • Published Mar 07, 2024 | 1:48 PMUpdated Mar 07, 2024 | 1:48 PM
మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ – బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్?

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక శుభవార్త రానుంది. ప్రస్తుతానికి ఇదొక పుకారు అయినప్పటికీ… నిజమైతే బాగుండు అని అందరూ అనుకునే వార్తే. దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 2006 సినిమాలో విడుదలయిన ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా కూడా నిలిచింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

సాధారణంగా ఒక హీరో ఒక భాషలో మంచి హిట్ సినిమాలో నటించిన తరువాత ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు మరో హీరో ఆ సినిమాకి న్యాయం చేయడమనేది అన్ని సినిమాలకి జరగదు. రవితేజ కెరీర్ లో అలాంటి సినిమానే “విక్రమార్కుడు”. ఎసీపీ విక్రమ్ రాథోడ్ పాత్రలో తనదైన ఇంటెన్సిటీ చూపిన రవితేజ… అప్పటి వరకూ కేవలం ఎంటర్టైన్మెంట్ ఉన్న పాత్రలే చేయగలరనే ఇమేజ్ ను మార్చేసి తాను సీరియస్ రోల్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించారు. అందుకే ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఇలాంటి చిత్రానికి పార్ట్ 2 అనే వార్త అందరినీ ఆశ్చర్యపరిచేదే అని చెప్పాలి.

మొదటి సినిమాకి ఉన్న ఇమేజ్ ఏమాత్రం చెదరకుండా సీక్వెల్ తీయాల్సి ఉంటుంది. నిర్మాత కేకే రాధా మోహన్ తాజాగా గోపీచంద్ “భీమా” ప్రమోషన్స్ లో విక్రమార్కుడు 2 పై సాలిడ్ అప్డేట్ అందించారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. రవితేజను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా రాధా మోహన్ తెలిపారు. కాగా ఈ సినిమాకి కూడా కథ విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారట. సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ ఎప్పుడు ఒకే అప్పుడు ఈ చిత్రాన్ని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆల్రెడీ “విక్రమార్కుడు 2” టైటిల్ రిజిస్టర్ కూడా చేయించానని రాధా మోహన్ తెలిపారు. మరి అభిమానుల కోరిక మేరకు రవితేజ ఈ క్రేజీ సీక్వెల్ కు ఒప్పుకోవాలని కోరుకుందాం.

విక్రమార్కుడు 2: మరోసారి విక్రమ్ రాథోడ్ యూనిఫాంలో రవితేజ!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet