iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంఛ్ పై ట్విస్ట్! వెంటనే అంతా సెట్!

  • Published Aug 07, 2024 | 11:54 AM Updated Updated Aug 07, 2024 | 1:01 PM

Mr Bachchan Movie: రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా ట్రిపుల్ ఏ సినిమాస్ లో ఈరోజు లాంఛ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఈ ఈవెంట్ నిలినివేస్తున్నట్లు మూవీ ఆర్గనైజర్స్ నిన్న రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారెమో అని చాలా టెన్షన్ పడ్డారు. అయితే తాజాగా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఈవెంట్ పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.

Mr Bachchan Movie: రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా ట్రిపుల్ ఏ సినిమాస్ లో ఈరోజు లాంఛ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఈ ఈవెంట్ నిలినివేస్తున్నట్లు మూవీ ఆర్గనైజర్స్ నిన్న రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారెమో అని చాలా టెన్షన్ పడ్డారు. అయితే తాజాగా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఈవెంట్ పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.

  • Published Aug 07, 2024 | 11:54 AMUpdated Aug 07, 2024 | 1:01 PM
మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంఛ్ పై ట్విస్ట్! వెంటనే అంతా సెట్!

మాస్ మహారాజా రవితేజ హరీష్, శంకర్ కాంబినేషన్ తెరకెక్కనున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిస్టర్ బచ్చన్’. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్ కాడడం గమన్హారం. ఇక ఇందులో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఈ మూవీ ఈనెల ఆగస్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ , సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇటు ప్రేక్షకులకు మరో వైపు రవితేజ ఫ్యాన్స్ కు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఆగస్ట్ 15వ తేదీన థియేటర్ లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలసిందే.

అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరుగా స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ హరీష్ శంకర్ టీమ్ కాస్త డిఫరెంట్ గా చేయనుంది. ఇప్పటికే మెట్రోలో రవితేజ వాయిస్ తో ఈ సినిమాకు డిఫరెంట్ గా పబ్లిసిటీ చేసింది. ఇదిలా ఉంటే.. రవితేజ మిస్టర్ బచన్ సినిమా ట్రైలర్ లంఛ్ ను నేడు మేకర్స్ ట్రిపుల్ ఏ సినిమాస్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఊహించని విధంగా ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నిన్న రాత్రి ఈవెంట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ ట్రైలర్ లాంఛ్ పై లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..

MR Bachan

తాజాగా ఈరోజు రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ గ్రాండ్ గా ట్రిపుల్ ఏ సినిమాస్ లో లాంఛ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇకపోతే మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఈవెంట్ ను యూవి మీడియా ఆర్గనైషన్ చేస్తుంది. ఈ క్రమంలోనే.. ఈ ఈవెంటుకు సంబంధించి ఎంట్రీ పాస్ లను కూడా ఫ్యాన్స్ కు ఇచ్చేసారు. కానీ ఉన్నట్టుండి ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు నిన్న రాత్రి ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా.. ‘కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈవెంట్ ని నిలిపివేసామని, దయచేసి అభిమానులు అర్ధం చేసుకోగలరని ఆర్గనైషన్ సంస్థ క్షమాపణలు కోరింది. అలాగే సినిమాకు సంబంధించి రాబోయే అప్ డేట్స్ కోసం నిర్మణాసంస్థను ఫాలో అవ్వండి’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది.

 

దీంతో రవితేజ ట్రైలర్ ఈవెంట్ క్యాన్సిల్  అయ్యిందని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అలాగే ఈ ఈవెంట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదుగా రిలీజ్ చేస్తారెమో అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మూవీ టీమ్..  మిస్టర్ బచ్చన్ ఈవెంట్ విషయంలో ఈవెంట్  ఆర్గనైజర్స్ వెనక్కి తగ్గింది కానీ, ఈవెంట్ క్యాన్సిల్ అవ్వలేదని, ఇక ఈ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్లాన్ చేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడా లేటెస్ట్ గా క్లారిటి కూడా ఇచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో రవితేజ ఫ్యాన్స్ జోష్ మీద ఉననారు. ఇకపోతే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు. అలాగే మిస్టర్ బచ్చన్ టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో.. ట్రైలర్ గురించి కూడా మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom