iDreamPost
android-app
ios-app

VD12 ఫస్ట్ లుక్ రిలీజ్..రష్మిక మందన్నా రియాక్షన్ ఇదే!

  • Published Aug 02, 2024 | 4:01 PM Updated Updated Aug 02, 2024 | 4:01 PM

Rashmika React On VD 12 First look Poster: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వీడీ12 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనిపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

Rashmika React On VD 12 First look Poster: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వీడీ12 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనిపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

  • Published Aug 02, 2024 | 4:01 PMUpdated Aug 02, 2024 | 4:01 PM
VD12 ఫస్ట్ లుక్ రిలీజ్..రష్మిక మందన్నా రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. తమ అద్భుతమైన నటనతో స్టార్ హోదాను పొందారు. అలాంటి టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డమ్ సంపాదించారు. ఆ తరువాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి..తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలు జస్ట్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే మరో సూపర్ హిట్ కోసం విజయ్ ఎంతగానో కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించి విజయ్  ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనిపై ఎంతో మంది ట్వీట్ చేస్తున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మంద్నా కూడా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

ఇటీవలే ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తరువాత ఆ స్థాయిలో సూపర్ హిట్ విజయ్ ఖాతలో ఇప్పటి వరకు పడలేదు. అలాంటి సాలిడ్ హిట్ కోసం ఈ రౌడీ హీరో ఎంతగానో కష్టపడుతున్నాడు. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి పని చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు ‘VD12’ అనే వర్కింగ్ పెట్టిన సంగతి తెలిసిందే.

విజయ్, గౌతమ్ కాంబినేషనలో వస్తున్న మొదటి సినిమా కావడంతో వీడీ 12 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాన అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీడీ 12 మూవీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. 2025 మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనితో పాటు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్ సామాజిక మాధ్యామాల్లో క్షణాల్లో వైరలైంది. విజయ్ ఫస్ట్ లుక్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందిస్తూ ట్వీట్  చేసింది. ఈ వీడీ 12 ఫస్ట్ లుక్‌‌ను షేర్ చేసిన రష్మిక మందన్నా “మ్యాడ్‌నెస్” అని రాసుకొస్తూ ఫైర్ ఎమోజీ యాడ్ చేసింది. దీంతో ఈ వీడీ12 ఫస్ట్ లుక్‌పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి.. వీడీ12 పోస్టర్ పై రష్మిక చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş