iDreamPost
android-app
ios-app

Kill Movie: ‘కిల్​’ తెలుగు రీమేక్ రైట్స్​కు ఫుల్ డిమాండ్.. ఎవరికి దక్కేనో?

  • Published Aug 13, 2024 | 5:17 PM Updated Updated Aug 13, 2024 | 5:30 PM

Kill Telugu Remake Rights: పాన్ ఇండియా మూవీ కల్చర్ పెరిగాక రీమేక్ సినిమాలు తగ్గిపోయాయి. దాదాపుగా ప్రతి పెద్ద చిత్రం బహు భాషల్లో డబ్ అయి విడుదలవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ట్రెండ్​లోనూ కొన్ని సూపర్​హిట్ సినిమాలు రీమేక్ అవడం విశేషం.

Kill Telugu Remake Rights: పాన్ ఇండియా మూవీ కల్చర్ పెరిగాక రీమేక్ సినిమాలు తగ్గిపోయాయి. దాదాపుగా ప్రతి పెద్ద చిత్రం బహు భాషల్లో డబ్ అయి విడుదలవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ట్రెండ్​లోనూ కొన్ని సూపర్​హిట్ సినిమాలు రీమేక్ అవడం విశేషం.

  • Published Aug 13, 2024 | 5:17 PMUpdated Aug 13, 2024 | 5:30 PM
Kill Movie: ‘కిల్​’ తెలుగు రీమేక్ రైట్స్​కు ఫుల్ డిమాండ్.. ఎవరికి దక్కేనో?

పాన్ ఇండియా మూవీ కల్చర్ పెరిగాక రీమేక్ సినిమాలు తగ్గిపోయాయి. దాదాపుగా ప్రతి పెద్ద చిత్రం బహు భాషల్లో డబ్ అయి విడుదలవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ట్రెండ్​లోనూ కొన్ని సూపర్​హిట్ సినిమాలు రీమేక్ అవడం విశేషం. ఇప్పటికీ కొన్ని సౌత్ మూవీస్​ను బాలీవుడ్​ మేకర్స్ రీమేక్స్ చేస్తున్నారు. హిందీలో వచ్చిన మంచి సబ్జెక్ట్స్​ను ఇక్కడి దర్శకులు తీసుకొని రీమేక్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య చూసుకుంటే దక్షిణాది సినిమాల రీమేక్స్​కు ఉన్నంత డిమాండ్ బాలీవుడ్​ ఫిల్మ్స్​కు లేదు. కానీ ఓ హిందీ చిత్రం హక్కుల కోసం మాత్రం భారీ పోటీ నెలకొంది. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు హీరోల పేర్లు ఆ మూవీ తెలుగు రీమేక్​ కోసం వినిపిస్తున్నాయి.

తెలుగు దర్శకనిర్మాతలు, హీరోలను అంతగా ఎట్రాక్ట్ చేస్తున్న ఆ సినిమానే ‘కిల్’. బాలీవుడ్​లో విడుదలై సూపర్​హిట్​గా నిలిచిందీ ఫిల్మ్. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్దకు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్​తో బ్లాక్​బస్టర్​ అయిపోయింది. ‘కిల్’లోని యాక్షన్ ఎపిసోడ్స్​ యూత్​ ఆడియెన్స్​కు విపరీతంగా నచ్చేశాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ ఎక్కువైంది. టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు హక్కులు చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ హీరోగా రానా దగ్గర నుంచి వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విశ్వక్​సేన్ వరకు పలువురు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి.

‘కిల్’ తెలుగు రైట్స్ కోసం సురేష్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రానాతో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆయన చూస్తున్నారట. సురేష్ బాబుతో పాటు పలువురు స్టార్ ప్రొడ్యూసర్స్ కర్చీఫ్ వేసేందుకు ట్రై చేస్తుండటంతో ‘కిల్’ ఒరిజినల్ మేకర్స్ భారీగా సొమ్ము చేసుకోవడం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. హక్కులు ఎవరికి దక్కుతాయనేది ఎంత ముఖ్యమో హీరోగా ఎవరు నటిస్తారనేది కూడా అంతే ఆసక్తికరంగా మారింది. రానా, విశ్వక్, బెల్లంకొండ శ్రీనివాస్, వరుణ్​లో ఎవరు యాక్ట్ చేసినా అదిరిపోతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఇంత డిమాండ్​ ఉన్న ఈ ఫిల్మ్ రీమేక్​లో ఎవరు నటిస్తారనేది త్వరలో తేలిపోతుంది. మరి.. ‘కిల్’ తెలుగు వెర్షన్​లో హీరోగా ఎవరు నటిస్తే చూడాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.