iDreamPost
android-app
ios-app

డబుల్ ఇస్మార్ట్- తంగలాన్ కు.. ఆ మూవీతో పొంచి ఉన్న పెను సవాలు!

  • Published Aug 13, 2024 | 4:45 PM Updated Updated Aug 13, 2024 | 4:45 PM

Double Ismart And Thangalaan Got Huge Competition In Bollywood: ఈసారి పంద్రాగస్టుకు పాన్ ఇండియా లెవల్లో చాలానే సినిమాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ లో కొన్ని సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, వాటికి బాలీవుడ్ లో మాత్రం గట్టి పోటీ తప్పేలా లేదు.

Double Ismart And Thangalaan Got Huge Competition In Bollywood: ఈసారి పంద్రాగస్టుకు పాన్ ఇండియా లెవల్లో చాలానే సినిమాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ లో కొన్ని సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, వాటికి బాలీవుడ్ లో మాత్రం గట్టి పోటీ తప్పేలా లేదు.

  • Published Aug 13, 2024 | 4:45 PMUpdated Aug 13, 2024 | 4:45 PM
డబుల్ ఇస్మార్ట్- తంగలాన్ కు.. ఆ మూవీతో పొంచి ఉన్న పెను సవాలు!

ఈసారి ఇండియన్ సినిమాలో ఆగస్టు 15కు ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం స్వాతంత్ర్య దినోత్సవం మాత్రమే కాకుండా.. సినిమా పండగలా మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో బడా బడా హీరోల సినిమాలు అన్నీ విడుదల అవుతున్నాయి. నిజానికి ఇది ఒక సంక్రాంతి సీజన్ లా కనిపిస్తోంది. ఆగస్టు 15కు లాంగ్ వీకెండ్ రావడంతో.. రిలీజుల కోసం పోటీలు పెట్టుకున్నారు. ఇప్పుడు రేసులో ఉన్న చిత్రాల్లో డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ మూవీస్ కి ఈ రిలీజ్ అగ్ని పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా లెవల్లో అద్భుతమైన సినిమాలు పోటీలో ఉండటమే అందుకు కారణంగా చెప్పచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విషయంలోనే వీళ్లు కంగారు పడాల్సి ఉంటుంది.

విక్రమ్ నుంచి వస్తున్న తంగలాన్ సినిమాపై సౌత్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. విక్రమ్ కెరీర్ లో ఒక క్రేజీ ఫిల్మ్ గా దీనిని భావిస్తున్నారు. ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ పాన్ ఇండియా కావడంతో అదే రేంజ్ లో పోటీని కూడా ఎదుర్కోక తప్పదు. అలాగే డబుల్ ఇస్మార్ట్ కి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కి బాలీవుడ్ లో కూడా బజ్ ఉంది. ఈ మూవీలో సంజయ్ దత్ ఉన్న విషయం తెలిసిందే. అయినా కూడా ఈ రెండు చిత్రాలు టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా గట్టి సవాళ్లు ఎదుర్కోక తప్పదు. తెలుగులో ఎంత పోటీ ఉందో.. బాలీవుడ్ లో అంతకన్నా ఎక్కువే పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు. అది కూడా ఒకే ఒక్క సినిమా విషయంలోనే కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

DIS Thang

ఇప్పుడు చెప్పుకుంటున్న మూవీ మరేదో కాదు.. శ్రద్ధా కపూర్- రాజ్ కుమార్- పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్ ప్లే చేసిన స్త్రీ 2 సినిమా నుంచే. మ్యాడోక్ ఫిల్మ్స్ తమ హారర్ ఫ్రాంచైజ్ లో భాగంగా తీసుకొచ్చిన ఈ స్త్రీ 2 చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. స్త్రీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుగులో కాంచన చిత్రం ఎలా అయితే భయపెడుతే పొట్ట చక్కలయ్యేలా నవ్విస్తుందో.. ఈ స్త్రీ సినిమా కూడా అలాంటిదే.

ఇప్పుడు ‘స్త్రీ 2’ రెట్టించిన ఉత్సాహంతో స్త్రీ 2 అయితే వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. పైగా కొత్త దెయ్యాన్ని విలన్ గా పరిచయం చేశారు. మొదటి పార్ట్ కంటే కూడా రెండో పార్ట్ లో హారర్, కామెడీ ఎలిమెంట్స్ బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ నంబర్ కూడా ఉంది. ఏది ఏమైనా కూడా సౌత్ లో ఈ మూవీస్ కి ఎలా ఉన్నా కూడా.. బాలీవుడ్ లో మాత్రం స్త్రీ 2 నుంచి పోటీ తప్పదు. అలాగే అదే రోజు జాన్ అబ్రహం హీరోగా తెచ్చిన వేదా కూడా విడుదల కాబోతోంది. స్త్రీ 2 సినిమా డబుల్ ఇస్మార్ట్- తంగలాన్ చిత్రాలకు పోటీ ఇస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss