Dharani
మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
Dharani
ప్రముఖ మీడియా సంస్థల అధినేత, మార్గదర్శి, ప్రియా పచ్చళ్ల గ్రూప్ యజమాని, ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థ ఛైర్మన్ రామోజీరావు.. కన్ను మూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం రామోజీరావు అనారోగ్యం బారినపడటంతో ఆయనను నానక్‌రామ్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇక గత రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న రామోజీరావు నేడు అనగా శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.
విద్యాభ్యాసం పూర్తైన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించారు రామోజీరావు. ముందుగా మార్గదర్శి చిట్‌ఫండ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం సినిమా నిర్మాతగా మారారు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ స్థాపించి.. అనేక చిత్రాలు రూపొందించారు. సుమారు 85కు పైగా సినిమాలు నిర్మించారు. రామోజీరావు అనగానే చాలా మంది కేవలం నిర్మాత మాత్రమే అనుకుంటారు. కానీ ఆయనకు నటన మీద కూడా ఆసక్తి మెండు. ఈ క్రమంలో ఆయన ఒక సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు. రామోజీ రావు ఓ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించారు.
1978లో యూ విశ్వేశ్వర రావు నిర్మించిన మార్పు అనే సినిమాలో రామోజీరావు గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన ఒక న్యాయమూర్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో రామోజీరావు చేసింది అతిథి పాత్రలోనే అయినా.. అప్పట్లో సినిమా పోస్టర్ మీద ఆయన బొమ్మ ప్రచురించడం హాట్ టాపిక్ అయింది. రామోజీరావు తన ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. ప్రతిఘటన, మౌనపోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచనగంగ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇక రామోజీరావు మృతిపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
రామోజీరావు 1936లో కృష్ణా జిల్లా పెదపారుపూడిలో.. ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఆరమోజీ రావుకు ఇద్దరు అక్కలు ఉన్నారు. రామోజీ రావు భార్య పేరు రమాదేవి. ఆయనకు ఇద్దరు సంతానం కిరణ్, సుమన్. అయితే వీరిలో సుమన్ కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు.