iDreamPost
android-app
ios-app

Pic Talk: గుర్తుపట్టలేనంతగా జగడం మూవీ హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  • Published May 21, 2024 | 5:37 PMUpdated May 21, 2024 | 5:37 PM

టాలీవుడ్​ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, సుకుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన జగడం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, ఈ సినిమాలో రామ్‌ సరసన హీరోయిన్‌ గా నటించిన ఈ హీరోయిన్‌ ఎవరికైనా గుర్తుందా.. ?అయితే ఆమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్‌ అవుతారు.

టాలీవుడ్​ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, సుకుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన జగడం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, ఈ సినిమాలో రామ్‌ సరసన హీరోయిన్‌ గా నటించిన ఈ హీరోయిన్‌ ఎవరికైనా గుర్తుందా.. ?అయితే ఆమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్‌ అవుతారు.

  • Published May 21, 2024 | 5:37 PMUpdated May 21, 2024 | 5:37 PM
Pic Talk: గుర్తుపట్టలేనంతగా జగడం మూవీ హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

టాలీవుడ్​ ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘దేవదాసు’ సినిమాతో 2006లో హీరోగా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రామ్. ఇక ఈ సినిమా తర్వాత రామ్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లోని  2007లో ‘జగడం’ అనే మూవీ వచ్చింది.  కాగా, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.  అయితే  అప్పటిలో ఆ  సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఆ సినిమాలో సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెప్పవచ్చు. అంతేకాకుండా.. ఇప్పటికి ఆ  సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ బాగా గుర్తుండిపోతాయి. అసలు జగడం సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది. ఇకపోతే ఈ సినిమాలో రామ్‌ కు జోడిగా నటించిన హీరోయిన్‌ ఎవరికైనా గుర్తుందా..? అయితే ఆమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్‌ అవుతారు.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ.. రామ్‌ పోతినేని, సుకుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన జగడం మూవీలో హీరోయిన్‌ గా నటించింది. కాగా, ఆమె పేరు ‘ఇషా సహానీ’. అయితే ఆ సినిమాలో ఆమె మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించింది. అలాగే తన క్యూట్ ఎక్స్‌ప్రెషెన్స్‌ తో  ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక అప్పటిలో ఈ చిన్నదాని నటన, అందానికి   యూత్ మొత్తం ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే.. కురాళ్ల  డ్రీమ్‌ గార్ల్‌ గా మారిపోయింది ఇషా. కానీ, జగడం సినిమా ఆశించిన  విజయం సాధించకపోవడంతో ఆమె తర్వాత ఏ సినిమాలో కనిపించ లేదు. కాగా, అప్పుడు ఎంతో అందంగా ఉన్న ఈషా ఇప్పుడు ఎలా మారిపోయింది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుందోనని సోషల్‌ మీడియాలో ఆమె ఫ్యాన్స్‌ తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

అయితే ఈష వెండితెరకు పరిచయం కాకముందు.. దక్షా సేత్ డ్యాన్స్ కంపెనీ లో మెయిన్ డ్యాన్సర్ గా పనిచేసేది.  అలాగే ఎన్నో పర్ఫామెన్స్ లు కూడా ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత జగడం మూవీలో అవకాశం దక్కించుకొని హీరోయిన్‌ గా వెండితెరకు పరిచయమయ్యింది. ఇక జగడం మూవీ తర్వాత ఇషా ‘బ్యాడ్ బాయ్’ అనే తమిళ్ సినిమా ఒకటి చేసింది. ఆ తర్వాత మరి ఏ సినిమాలోనూ నటించలేదు.

ఇక ప్రస్తుతానికి ఇషా ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ డ్యాన్స్ స్కూల్ ను కూడా నడుపుతుంది. కాగా, ప్రస్తుతానికి ఆమె సంబంధించిన లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అయితే ఆ ఫోటోస్‌ చూసిన నెటిజన్స్‌ ఇషా చాలా మారిపోయిందని గుర్తుపట్టాడం చాలా కష్టమని కామెంట్స్‌ చేస్తున్నారు. మరి, ఇషా సుహాని లేటెస్ట్‌ ఫిక్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి