iDreamPost
android-app
ios-app

‘డబుల్ ఇస్మార్ట్​’లో మరో బాలీవుడ్ స్టార్! కొత్తగా ఎవరొస్తున్నారంటే..?

  • Published Feb 20, 2024 | 5:26 PM Updated Updated Feb 20, 2024 | 5:26 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఉస్తాద్ రామ్ కాంబోలో వస్తున్న కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్స్​ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఉస్తాద్ రామ్ కాంబోలో వస్తున్న కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్స్​ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.

  • Published Feb 20, 2024 | 5:26 PMUpdated Feb 20, 2024 | 5:26 PM
‘డబుల్ ఇస్మార్ట్​’లో మరో బాలీవుడ్ స్టార్! కొత్తగా ఎవరొస్తున్నారంటే..?

కమర్షియల్ సినిమాల్లో విలన్ పాత్రలకు చాలా డిమాండ్ ఉంటుంది. కథానాయకుడికి తగ్గట్లుగా ప్రతినాయకుడు ఉండాలి. కొన్ని చిత్రాల్లో హీరోను వీక్​గా చూపించి.. విలన్​ను చాలా స్ట్రాంగ్​గా ప్రెజెంట్ చేస్తారు. దీని వల్ల విలన్​ మీద హీరో గెలిస్తే ఆడియెన్స్ మూవీని బాగా ఓన్ చేసుకుంటారు. టాలీవుడ్ మూవీస్​లో ఈ ఒరవడిని ఎక్కువగా చూడొచ్చు. తెలుగులో ఎక్కువ మటుకు విలన్లను నార్త్ నుంచి దింపేస్తారు. మన సినిమాల్లో బాలీవుడ్ విలన్ అనే ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ అవుతుండటంతో హిందీ నుంచి విలన్లను దింపుతున్నారు మేకర్స్. తాజాగా అలా మరో బాలీవుడ్ యాక్టర్​ను తెలుగులో విలన్ రోల్​కు తీసుకుంటున్నారని టాక్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఉస్తాద్ రామ్ కాంబోలో వస్తున్న ఫిల్మ్​లో మరో హిందీ స్టార్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

రామ్-పూరి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో ఇదే కాంబోలో వచ్చిన బ్లాక్​బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్​గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ మూడో కంటికి తెలియకుండా ఫాస్ట్​​గా ఫినిష్ చేస్తున్నారు. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఎప్పుడో గానీ పెద్దగా అప్​డేట్స్ రావడం లేదు. ‘లైగర్’ ఫ్లాప్​తో పూరి, ‘స్కంధ’ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో రామ్ కాస్త డల్ ఫేస్​లో ఉండటమే వీళ్ల కాంబోలో వస్తున్న సినిమా లోప్రొఫైల్​కు కారణమని అంటున్నారు. అందుకే మూవీ నుంచి పెద్దగా అప్​డేట్స్ రావడం లేదని సమాచారం. ఈ చిత్రంలో ఇప్పటికే విలన్ రోల్​ కోసం ఖల్​ నాయక్ సంజయ్ దత్​ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కూడా ఈ సినిమా సెట్స్​లో జాయిన్ అవనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

‘డబుల్ ఇస్మార్ట్​’లో ఒక కీలక పాత్ర కోసం బాబీ డియోల్​ను మేకర్స్ కాంటాక్ట్ అయ్యారట. ఇప్పటికే విలన్ రోల్ కోసం సంజూ బాబాను తీసుకున్నారు. ఇప్పుడు మరో బ్యాడీ అవసరం ఏర్పడటంతో బాబీని పిలుస్తున్నారట. అయితే పూరి ఆఫర్​కు బాలీవుడ్ స్టార్ ఓకే చెప్పాడో లేదో తెలియరాలేదు. అటు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ లేదా ఇటు బాబీ గానీ దీనిపై ప్రకటన చేస్తే గానీ ఏదీ చెప్పలేం. ఇక, ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న రిలీజ్ చేస్తామని టీమ్ చెప్పింది. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే చెప్పిన టైమ్​కు రావడం కష్టంగానే ఉంది. అయితే సినిమాలను త్వరగా ఫినిష్ చేసే పూరి తలచుకుంటే ముందు ప్రకటించిన సమయానికి మూవీని రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక, ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి.. బాబీ డియోల్ టాలీవుడ్ ఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Serial Actor: కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు.. బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ కష్టాలు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom