iDreamPost
android-app
ios-app

చిరంజీవిపై RGV ఆసక్తికర వ్యాఖ్యలు.. రియాలిటీకి దూరమవుతున్నారంటూ..!

  • Author singhj Published - 04:29 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 04:29 PM, Fri - 11 August 23
చిరంజీవిపై RGV ఆసక్తికర వ్యాఖ్యలు.. రియాలిటీకి దూరమవుతున్నారంటూ..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో రాజకీయం చాలా వాడీవేడీగా నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేనల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్​లో సాగుతోంది. రీసెంట్​గా ‘వాల్తేరు వీరయ్య’ మూవీ 200 రోజుల సక్సెస్​ మీట్​లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఏపీ మంత్రులు సీరియస్ అవుతున్నారు. ప్రభుత్వాలకు కాదు ముందు తన తమ్ముడికి మెగాస్టార్ సలహా ఇవ్వాలని చెబుతున్నారు. తాజాగా చిరుపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భజన, పొగడ్తలకు అలవాటు పడిపోయి చిరంజీవి రియాలిటీకి దూరమవుతున్నారంటూ విమర్శించారు.

‘భోళా శంకర్’ చిత్రం ప్రమోషన్స్​లో చిరంజీవిపై కమెడియన్ హైపర్ ఆది లాంటి వాళ్లు ప్రశంసలు కురిపించడం మీద వర్మ ఒక ట్వీట్ చేశారు. హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన, పొగడ్తలకు అలవాటు పడిపోయి, రియాలిటీకి మెగాస్టార్ దూరమవుతున్నారని అనిపిస్తోందన్నారు ఆర్జీవీ. పొగడ్తలతో ముంచే బ్యాచ్ కంటే ప్రమాదకరమైన వాళ్లు మరొకరు ఉండరన్నారు. రియాలిటీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. వాళ్ల పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే వారిని దూరం పెట్టాలని వర్మ సూచించారు.

ఆర్జీవీ తన ట్వీట్​లో ‘జబర్దస్త్​’ను జబర్ అని, హైపర్ ఆదిని ‘హైపర్’ అని పరోక్షంగా, వెటకారంగా ప్రస్తావించారు. ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి మీద ప్రశంసలు కురిపించిన డైరెక్టర్స్ అందర్నీ ఆస్థాన విదూషకులుగా వర్మ పోల్చారని నెటిజన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ మూవీకి మార్నింగ్ షో నుంచే మిక్స్​డ్ టాక్ వచ్చేసింది. మెగాస్టార్ నటన తప్పితే సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ లేవని.. బోరింగ్​గా ఉందని విమర్శకులు అంటున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibom