iDreamPost
android-app
ios-app

మరో డీల్ క్లోజ్ చేసిన రామ్ డబుల్ ఇస్మార్ట్.. ఎన్ని కోట్లో తెలుసా?

  • Published Jul 29, 2024 | 11:38 AM Updated Updated Jul 29, 2024 | 12:23 PM

Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటక్ స్టార్ రామ్ పోతినేని, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ , ఆడియో రైట్స్ అంటూ అన్ని డీల్ ఫిక్స్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా మరో డీల్ కూడా భారీ ధరకు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటక్ స్టార్ రామ్ పోతినేని, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ , ఆడియో రైట్స్ అంటూ అన్ని డీల్ ఫిక్స్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా మరో డీల్ కూడా భారీ ధరకు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

  • Published Jul 29, 2024 | 11:38 AMUpdated Jul 29, 2024 | 12:23 PM
మరో డీల్ క్లోజ్ చేసిన రామ్ డబుల్ ఇస్మార్ట్.. ఎన్ని కోట్లో తెలుసా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇక ఈ సినిమాకు ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. అయితే ఇంతకు ముందే వీరి కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రేక్షకులను మరీంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి డబుల్ ఇస్మార్ట్ తో ముందుకు రానున్నారు. కాగా, ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు పూరీ డైరెక్షన్, రామ్ యాక్షన్ చూద్దమా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

ఇక విషయం పక్కన పెడితే.. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ.56 కోట్లకు నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేయగా.. హిందీ రైట్స్ కు రూ.6 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఓటీటీ రైట్స్ ను కూడా రూ.33 కోట్లకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోఅమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇకపోతే ఆడియో రైట్స్ ను రూ.9 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ కు నిర్మాత ఛార్మి కౌర్ సేల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు సమాచారం అందింది. కానీ, ఈ విషయంపై మూవీ టీమ్ కానీ, అటు జీ తెలుగు కానీ, అధికారికంగా ప్రకటించలేదు. ఒక వేళ ఇదే నిజమై ఉంటే..  రామ్ కెరీర్ లో అత్యధిక ధరకకు అమ్ముడు అయిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. అలాగే డబుల్ ఇస్మార్ట్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను మాత్రం సొంతం చేసుకుంటే.. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టే అవకాశం ఉంటుంది.  ఇక ప్రస్తుతానకి అయితే ఈ సినిమా  విడుదల దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ వేగవంతంగా ప్రారంభించే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో భాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరీ, డబుల్ ఇస్మార్ట్ సినిమాకు శాటిలైట్స్ రైట్స్ ను జీ తెలుగు కొనుగోలు చేసిందనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet