iDreamPost
android-app
ios-app

Ram Charan: బుర్ర బద్దలయ్యే న్యూస్.. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడా?

  • Published Aug 10, 2024 | 12:28 PM Updated Updated Aug 10, 2024 | 12:28 PM

గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో చరణ్ రెండు కాదు.. ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. మరి ఆ న్యూస్ లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో చరణ్ రెండు కాదు.. ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. మరి ఆ న్యూస్ లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 10, 2024 | 12:28 PMUpdated Aug 10, 2024 | 12:28 PM
Ram Charan: బుర్ర బద్దలయ్యే న్యూస్.. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు షూటింగ్ మెుత్తం పూర్తి కావొచ్చింది. ఇక ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. దాంతో మెగా ఫ్యాన్స్ డిసెంబర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ బుర్ర బద్దలు అయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? గేమ్ ఛేంజర్ లో చరణ్ రెండు కాదు.. మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఈ వార్తకు సంబంధించి అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి మూవీ నుంచి లీక్ అయిన సీన్సే సాక్ష్యాలుగా నిలిచాయి. పొలిటికల్ లీడర్ గా, ఆయన కొడుకుగా చరణ్ రెండు విభిన్నమైన రోల్స్ లో కనిపిస్తాడని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో మూడో పాత్రలో కూడా చరణ్ నటిస్తున్నాడన్న వార్త వైరల్ గా మారింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే..

ram charan game changer

అప్పన్నగా నిజాయితీ గల పొలిటికల్ లీడర్ గా చరణ్ కపిస్తుండగా.. ఆయన కొడుకు రామ్ నందన్ పాత్రలో మరో రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక కాలేజీలో చదుకునే కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అక్కడే కియారా అద్వానితో ప్రేమలో పడుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్ గా మరిన తర్వాత చరణ్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఇది తెలిసి చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మూడు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. త్రిపాత్రాభినయం వెనక ఉన్న కథ ఇది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో జయరాం, సునీల్, ఎస్ జే సూర్య లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్లు నవంబర్ లో స్టార్ట్ చేస్తారని సమాచారం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet