iDreamPost
android-app
ios-app

Game Changer: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

  • Published Aug 29, 2024 | 3:05 PM Updated Updated Aug 29, 2024 | 3:05 PM

Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 29, 2024 | 3:05 PMUpdated Aug 29, 2024 | 3:05 PM
Game Changer: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

గేమ్ ఛేంజర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమా వాయిదా పడుతుందని, రీ షూట్ చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజుకు శంకర్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిపై తాజాగా దిల్ రాజు ఓ వేడుక సందర్భంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ డేట్ ను ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ప్రస్తుతం ఈ ప్రశ్నకు ఆన్సర్ కోసం చరణ్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు ఎంతగాతో ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డు త్వరలోనే పడబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వినాయక చవితి పండగ సందర్భంగా అదే రోజున లేదా.. అంతకంటే ముందుగానో రిలీజ్ డేట్ ను చెప్పడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. అన్నీ కుదిరితే.. డిసెంబర్ 20న విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కావడంతో.. చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

game changer release date fix

కాగా.. గేమ్ ఛేంజర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 20 థియేటర్లలోకి రావడానికి నితిన్ రాబిన్ హుడ్ తో పాటుగా నాగచైతన్య తండేల్ మూవీలు రిలీజ్ డేట్ ప్రకటించి రెడీ అవుతున్నాయి. వీటితో పాటుగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా డిసెంబర్ లోనే రాబోతోంది. దాంతో డిసెంబర్ లో బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల మధ్య బిగ్ వార్ తప్పేలా లేదు. అయితే నిర్మాతలు చర్చలు జరుపుకొని ఎవరైనా వెనక్కి తగ్గుతారో చూడాలి మరి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet