iDreamPost
android-app
ios-app

Nani: సరిపోదా శనివారం కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో.. ఒక్క పిక్ లోనే చెప్పేసిన నాని!

  • Published Aug 29, 2024 | 2:23 PM Updated Updated Aug 29, 2024 | 2:23 PM

Nani tweet viral after release Saripoda Sanivaaram movie: నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత నాని చేసిన తొలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ పడ్డ కష్టం ఒక్కపిక్ లోనే చెప్పేశాడు.

Nani tweet viral after release Saripoda Sanivaaram movie: నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత నాని చేసిన తొలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ పడ్డ కష్టం ఒక్కపిక్ లోనే చెప్పేశాడు.

  • Published Aug 29, 2024 | 2:23 PMUpdated Aug 29, 2024 | 2:23 PM
Nani: సరిపోదా శనివారం కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో.. ఒక్క పిక్ లోనే చెప్పేసిన నాని!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ న్యాచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి షో నుంచి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నాని, ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ మూవీ. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని ట్విట్టర్ వేదికగా ఫస్ట్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ-నాని కాంబోలో లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ట్రైలర్ తోనే మాస్ ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేసిన నాని.. మూవీలో అంతకు మించి మాస్ యాక్టింగ్ తో కట్టిపడేశాడు. నాని-ఎస్ జే సూర్యల నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన రూట్ ను మార్చి పక్కా యాక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో ఒకే ఒక్క పిక్ లో తెలియజేశాడు నాని. టీమ్ మెుత్తం మూవీ చూశాక అక్కడే సీట్లో కూర్చుని నిద్రపోయాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని పోస్ట్ చేసిన మెుదటి పోస్ట్ ఇదే. సినిమా కోసం ఎంత పడ్డ కష్టం ఈ ఒక్క పిక్ లోనే తెలిసిపోతుంది. ఇది నీ కోసమే వివేక్ అంటూ లవ్ సింబల్ ఎమోజీని పెట్టి వివేక్ పడుకున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మూవీలో నాని మాస్ యాక్టింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ను నాని రాబట్టడం ఖాయంగా తెలుస్తోంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş