iDreamPost
android-app
ios-app

RC16.. నిరాశలో ఫ్యాన్స్! కారణం ఏంటంటే?

  • Published Aug 08, 2024 | 11:46 AM Updated Updated Aug 08, 2024 | 11:46 AM

Ram Charan: టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న మూవీ RC16. అయితే RC16 సినిమా షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు.

Ram Charan: టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న మూవీ RC16. అయితే RC16 సినిమా షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు.

  • Published Aug 08, 2024 | 11:46 AMUpdated Aug 08, 2024 | 11:46 AM
RC16.. నిరాశలో ఫ్యాన్స్! కారణం ఏంటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రం గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు. అయితే ఇదొక భారీ బడ్జెట్ మూవీ కాగా, ఇందులో హీరోయిన్లుగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్న విషయం తెలసిందే. ఇకపోతే ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పొస్టర్ లుక్స్, సాంగ్ పై భారీగా రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై ఇటు సినీ ప్రేక్షకులతో పాటు రామ్ చరణ్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నమని ఇటీవలే దిల్ రాజ్ చెప్పిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ మూవీ 10 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. నిన్నటి నుంచి ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం చేయగా.. త్వరలోనే టీజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కూడా వినిపించింది. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 సినిమా చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు త్వరలోనే మెగా హీరో రామ్ చరణ్ తో ‘RC16’ సినిమా చేయనున్నా విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. ఇకపోతే ఇదొక రా అండ్ రస్టిక్ డ్రామా అని, స్పోర్ట్స్  నేపథ్యం కలగలిగి ఉంటుంది. పైగా మునపెన్నడూ రామ్ చరణ్ ను చూడని మేకోవర్ లో కనిపించబోతున్నాడని, పైగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా సినిమా ఉండబోతుందని ఇటీవలే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కానీ, ఈ RC16 సినిమా షూటింగ్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వినిపించింది.కానీ, తాజాగా రామ్ చరణ్ RC16 సినిమా షూటింగ్ మరీంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. మొన్నటి వరకు సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపించగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో మొదలవ్వబోతుందని సమాచారం వినిపిస్తోంది.

కాకపోతే ఈ సినిమాకు ఎలాంటి గ్యాప్ లేకుండా చిత్రీకరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే స్క్రీన్ ప్లే తో పాటుగా, మ్యూజిక్ కి సంబందించిన విషయాలు కూడా ప్లాన్ చేశారు. కాగా, ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎప్పుడెప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ షూటింగ్ ప్రారంభమవుతుందా.. ఈ మూవీ నుంచి ఏ అప్ డేట్ వస్తుందానని రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. కానీ, ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా జరగనుందని టాక్ వినిపించడంతో.. చరణ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు. మరీ, రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న RC16 సినిమా షూటింగ్ పై వినిపిస్తున్న సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş