అయోమయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్.. ఈ పరిస్థితికి కారణం?

టాలీవుడ్ లో సీనియర్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు అందరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం అయోమయంలో ఉన్నారు. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? పూర్తి వివరాలు..

టాలీవుడ్ లో సీనియర్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు అందరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం అయోమయంలో ఉన్నారు. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? పూర్తి వివరాలు..

టాలీవుడ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు అందరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం అయోమయంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఆందోళన, కన్ప్యూజన్ లో ఉన్నారు. అయితే స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ పరిస్థితి నెలకొనడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప 2.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన మూవీ. దానికి కారణం మనందరికి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ షూటింగ్ కు అనుకోకుండా బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లారు. దాంతో ఇప్పటి ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6 కు వాయిదా పడిన మూవీ.. ఈసారైనా అనుకున్న టైమ్ కు వస్తుందా? రాదా? అన్నది ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురిచేస్తోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ పరిస్థితి కూడా ఇదే. భారతీయుడు 2 కారణంగా డైరెక్టర్ శంకర్ ఈ మూవీని ఆలస్యం చేస్తూ వచ్చాడన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఆ మూవీ విడుదల అయ్యింది. ఇప్పటికైనా గేమ్ ఛేంజర్ షూటింగ్ ను స్పీడప్ చేస్తాడా? థియేటర్లోకి అనుకున్న టైమ్ కు తీసుకొస్తాడా? అన్నది సందేహంగా మారింది.

కాగా.. పుష్ప 2, గేమ్ ఛేంజర్ ల కంటే భిన్నమైన పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తున్నాం అంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అయ్యిందా?లేదా? అన్న అప్డేట్ లేనే లేదు. పైగా రెండో సింగిల్ కూడా బయటకి రాలేదు. పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీకి ఆ రేంజ్ ప్రమోషన్లు జరగట్లేదని ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. అదీకాక అప్డేట్స్ ఇవ్వట్లేదని నిరాశలో ఉన్నారు. ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ మూవీలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితి కారణం ఏంటంటే?

పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర.. ఈ మూడు చిత్రాలు వేటికవే కథలు. ఒకదానితో మరోదానికి సంబంధం లేదు. పైగా మూడు చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. దాంతో మేకర్స్ పై సహజంగానే కాస్త ఒత్తిడి ఉంటుంది అన్నది కాదనలేని సత్యం. ఆ ఒత్తిడి ఎదుర్కొని పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలన్న ఒకే ఒక్క కారణమే.. ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. డైరెక్టర్లు సినిమాకు అద్భుతంగా చెక్కే క్రమంలో రిలీజ్ లు దూరంగా జరుగుతున్నాయి. అంతే తప్ప మరో కారణం లేనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. అన్ని సమస్యలు వైదొలికి త్వరగా ఈ సినిమాలు థియేటర్లలోకి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments