iDreamPost
android-app
ios-app

Rakshith Shetty : OTT సంస్థలపై రక్షిత్ శెట్టి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే !

  • Published Jun 19, 2024 | 9:36 AM Updated Updated Jun 19, 2024 | 9:36 AM

కన్నడ హీరో రక్షిత్ శెట్టి.. గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రక్షిత్ శెట్టి.. ఓటీటీ సంస్థలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి.. గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రక్షిత్ శెట్టి.. ఓటీటీ సంస్థలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jun 19, 2024 | 9:36 AMUpdated Jun 19, 2024 | 9:36 AM
Rakshith Shetty : OTT సంస్థలపై రక్షిత్ శెట్టి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే !

777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా బాగా సుపరిచితుడైపోయాడు.. కన్నడ హీరో రక్షిత్ శెట్టి. అటు సినిమాలలో నటిస్తూనే.. రక్షిత్ ఓ సిరీస్ కు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ సిరీస్ పేరు ఏకమ్‌ . దాదాపు ఈ సినిమా పూర్తయ్యి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. 2020 లో ఈ సిరీస్ ను పూర్తి చేసిన కూడా.. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఏ డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కూడా కొనుగోలు చేయలేదు. ఇక ఇదే విషయంపై రక్షిత్ మాట్లాడుతూ.. ఓటీటీ సంస్థలపై మండిపడ్డారు. అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

రక్షిత్ శెట్టి.. నిర్మాతగా వ్యవహరించిన సిరీస్ ఏకమ్‌ స్ట్రీమింగ్ విషయమై ట్విట్టర్ లో స్పందించారు రక్షిత్. ఆయన ఈ సిరీస్ విషయమై ఇలా రాసుకొచ్చారు. “జనవరి 2020లో ఏకమ్‌ సిరీస్‌ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్‌కి అదే సరైన సమయం అనిపించింది.. కరోనా వల్ల దానికి బ్రేక్ పడింది.. మేలో అనుకున్నాం.. ఫైనల్ చేసాము కానీ ఓటీటీ కోసం ఎదురు చూసాము కానీ ఒక్కటి కూడా ముందుకు రాకపోవడం అసంతృప్తిని వ్యక్తం చేసింది.. తెలుగు, హిందీ, తమిళ్ , మలయాళం కంటెంట్ కు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. కన్నడ కంటెంట్ ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థంకావడం లేదు. పెద్ద హిట్ సినిమాలను మాత్రమే.. ఓటీటీ లోకి తీసుకుంటున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరికన్నా కన్నడ పరిశ్రమ వెనుక ఉంది. ” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు రక్షిత్.

దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రక్షిత్ చెప్పిన మాటలలో వాస్తవం లేకపోలేదని.. కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇకపై అయినా ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చి కన్నడ సినిమాలను , సిరీస్ లను కొనుగోలు చేస్తాయో లేదో వేచి చూడాలి. గత మూడేళ్ళ చూసినట్లయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు డిమాండ్ బాగానే పెరుగుతుంది. డైరెక్ట్ గా ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ ను కూడా ఏదైనా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. ఇక ప్రస్తుతానికైతే..ఏకమ్‌ వెబ్ సిరీస్ కోసం సొంతంగా ఓ వెబ్ సైట్ తో ప్లాట్ ఫార్మ్ ను తీసుకుని వచ్చారు రక్షిత్ శెట్టి. www.ekamtheseries.com అనే వెబ్ సైట్ లో జులై 13 నుంచి.. స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.