Swetha
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంది.
Swetha
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంది. కనీసం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా ఇవ్వడం లేదు. దీనితో అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. వచ్చినప్పుడు వస్తుందిలే అని దీని ఊసు కూడా సోషల్ మీడియాలో తీసుకుని రావడం లేదు.
అయితే రీసెంట్ గా రాజాసాబ్ టీం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టీజర్ ను జూన్ 6న రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనితో ఇప్పుడు అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది. టీజర్ ఎలా ఉండబోతుంది? ప్రభాస్ ను మారుతి ఎలా చూపించబోతున్నాడు ? మూడు పాత్రలలో ప్రభాస్ ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తాడు. ఇలా సినిమా మీద రకరకాల ప్రశ్నలు , సందేహాలు అందరికి తలెత్తుతున్నాయి. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్స్ , కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయే సరికి బజ్ పూర్తిగా తగ్గిపోయింది.
ఇప్పటికి కూడా సినిమా కంప్లీట్ అయిందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అంటూ ఇంకో రీజన్ కూడా వినిపిస్తుంది. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఒకవేళ జూన్ 6న టీజర్ వస్తే కనుక అప్పుడైనా ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.