iDreamPost
android-app
ios-app

Radhe Shyam : ఇవి సరిచేసుకుంటే హిట్ టాక్ వచ్చేదేమో

  • Published Mar 13, 2022 | 11:29 AM Updated Updated Dec 11, 2023 | 11:38 AM

మొదటి రోజు 38 కోట్ల షేర్ కే పరిమితం కావడం కొంత ఆందోళన కలిగించిన మాట వాస్తవం. ముఖ్యంగా కేరళ, నార్త్ లో వచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ ని టెన్షన్ పెట్టింది. రేపటి నుంచి ఎలా నిలబడుతుందన్నది కీలకంగా మారింది. ఫైనల్ వర్డిక్ట్ సాహో కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనా నిజమయ్యేలా ఉంది.

మొదటి రోజు 38 కోట్ల షేర్ కే పరిమితం కావడం కొంత ఆందోళన కలిగించిన మాట వాస్తవం. ముఖ్యంగా కేరళ, నార్త్ లో వచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ ని టెన్షన్ పెట్టింది. రేపటి నుంచి ఎలా నిలబడుతుందన్నది కీలకంగా మారింది. ఫైనల్ వర్డిక్ట్ సాహో కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనా నిజమయ్యేలా ఉంది.

Radhe Shyam : ఇవి సరిచేసుకుంటే హిట్ టాక్ వచ్చేదేమో

తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ నిన్న ఇవాళ స్ట్రాంగ్ గా ఉంది. టాక్ తో సంబంధం లేకుండా అడ్వాన్ ఫుల్స్ తో ప్రధాన కేంద్రాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు 38 కోట్ల షేర్ కే పరిమితం కావడం కొంత ఆందోళన కలిగించిన మాట వాస్తవం. ముఖ్యంగా కేరళ, నార్త్ లో వచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ ని టెన్షన్ పెట్టింది. రేపటి నుంచి ఎలా నిలబడుతుందన్నది కీలకంగా మారింది. ఫైనల్ వర్డిక్ట్ సాహో కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనా నిజమయ్యేలా ఉంది. 300 కోట్ల బడ్జెట్ తో ఇంత గ్రాండ్ స్కేల్ తో నిర్మించిన గ్రాండియర్ కు ఇలాంటి స్పందన దక్కడం ఎవరూ ఊహించనిది. జనం స్పందన బట్టి చూస్తే ప్రధానంగా అయిదు పొరపాట్లు కనిపిస్తున్నాయి.

మొదటిది ఇలాంటి ప్రేమకథలుకు పాటలు చాలా కీలకం. ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే సాంగ్స్ పడాలి. గీతాంజలి, అభినందన తరహాలో ఓ రేంజ్ లో మ్యూజికల్ క్లాసిక్స్ గా నిలిచిపోవాలి. కానీ రాధే శ్యామ్ విషయంలో ఈ అంచనా తప్పింది. జస్టిన్ ప్రభాకరన్ మేజిక్ చేయలేకపోయాడు. రెండు పాటలు మినహాయించి మిగిలినవి మళ్ళీ మళ్ళీ వినేలా అనిపించలేదు. రెండో పొరపాటు క్యాస్టింగ్. జగపతిబాబు, మురళీశర్మ, భాగ్యశ్రీ లాంటి మంచి తారాగణం సరైన సీన్లు పడక వృథా అయ్యింది. కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్టులనే పేరు తప్ప ఏమి మిగల్లేదు. మూడో మిస్టేక్ లవ్ స్టోరీ ల్యాగ్. ఎమోషన్స్ ని రిజిస్టర్ చేయాలని చూసిన సాగతీత ఫైనల్ గా బోర్ కొట్టించింది.

నాలుగోది క్లైమాక్స్ లో ప్రభాస్ ఎలా బ్రతికాడనేది క్లారిటీగా చూపించకపోవడం. హడావిడిగా ముగిసిన ఫీలింగ్ కలిగించింది. కామన్ ఆడియన్స్ కి ఇది అసంతృప్తి కలిగించింది. అయిదో పొరపాటు ఎడిటింగ్. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు సినిమాలో లేకపోవడం ముమ్మాటికీ తప్పే. కీలకమైన డ్రామాకు ఆ సీన్లు పెట్టి ప్రేమకథను కాస్త ట్రిమ్ చెసి ఉంటే అవుట్ ఫుట్ ఇంకా బెటర్ గా ఉండేది. కానీ అలా జరగలేదు. కారణమేంటో టీమ్ చెప్పాలి. ఈ శుక్రవారం జేమ్స్, స్టాండ్ అప్ రాహుల్, బచ్చన్ పాండేలు వస్తున్న నేపథ్యంలో రాధే శ్యామ్ ఆర్ఆర్ఆర్ వచ్చే 25వ తేదీ లోగా ఎంతమేరకు రాబడుతుందో చూడాలి. ఇంకా 150 కోట్లకు పైగానే రావాలి మరి

Also Read : Jr NTR : 2 సినిమాలతో యంగ్ టైగర్ ప్లానింగ్