iDreamPost
android-app
ios-app

Pushpa 2: వీడియో: ముంబైని ఊపేస్తున్న పుష్ప రాజ్ క్రేజ్! లోకల్ ట్రైన్ లో ‘పుష్ప’

ఐకాన్ స్టార్, నేషనల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పుష్ప క్రేజ్ ముంబైని ఊపేస్తుంది.

ఐకాన్ స్టార్, నేషనల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పుష్ప క్రేజ్ ముంబైని ఊపేస్తుంది.

Pushpa 2: వీడియో: ముంబైని ఊపేస్తున్న పుష్ప రాజ్ క్రేజ్! లోకల్ ట్రైన్ లో ‘పుష్ప’

ఇటీవల కాలంలో కొన్ని సాంగ్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసిన వాటి క్రేజ్ కనిపిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ఆ సాంగ్స్ కు స్టెప్పులు వేస్తుంటారు. ఆర్ఆర్ఆర్, పుష్ప,కేజీఎఫ్ వంటి సినిమాల్లోని పాటలు వర్డల్ వైడ్ కా క్రేజ్ సంపాదించాయి. ముఖ్యంగా పుష్ప సాంగ్స్, తగ్గేదేలే అనే డైలాగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా పుష్ప 2 నుంచి వచ్చిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఏకంగా ఓ వర్డల్ ఫేమస్ యూట్యూబర్ ముంబై లోకన్ ట్రైన్ లో పుష్ప సాంగ్ కి స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది.

ఐకాన్ స్టార్, నేషనల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా భారీ సాధించిన తరువాత పుష్ప  పార్ట్ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఆ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15 ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే పుష్ప 2 నుండి తొలి సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్’ అంటూ సాగిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, యూట్యూబ్ ల్లో ఎక్కడ చూసినా ఈ సాంగ్ రీల్స్ కనిపిస్తున్నాయి.

ఈ పాటలో బన్నీ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అవుతోన్నాయి. సామాన్యుల నుంచి స్టార్ ల వరకు అందరూ ఈ స్టెప్ తో రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ ఫేమస్ యూట్యూబర్ ఈ సేంగ్ అదే స్టెప్ వేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అది కూడా ముంబై లోకల్ ట్రైన్ లో. ఆ యూట్యూబర్ ముంబై లోకల్ ట్రైన్ లో ప్యాసింజర్స్ తో కలిసి పుష్ప పాటకు స్టెప్ వేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది. పిచ్చుకు గూడు లాంటి జుట్టు వేసుకుని పుష్ప పాటకు స్టెప్ లువేసిన ఆ వ్యక్తి పేరు నోయిల్  రాబిన్స్.

అతడికి యూట్యూబ్ లో 15.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అతడి వర్డల్  వైడ్ బాగా ఫేమస్. ఆ వ్యక్తి ఏకంగా లోకల్ ట్రైన్ లో ప్రయాణికులతో కలిసి పుష్ప సాంగ్ కి స్టెప్పులు వేశారు.ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది ఇది ఐకాన్ స్టార్ క్రేజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందటే.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. మరి..వైరల్ అవుతోన్న ఆ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Noel Robinson (@noelgoescrazy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి