Swetha
Pushpa 2 Boycott :పుష్ప 2 సినిమా గురించి ఇప్పుడు ఎంత బజ్ క్రియేట్ అయిందో తెలియనిది కాదు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. పుష్ప 2 కి కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. కర్ణాటకలో పుష్ప సినిమాను బాయ్ కాట్ చేస్తున్నారట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Pushpa 2 Boycott :పుష్ప 2 సినిమా గురించి ఇప్పుడు ఎంత బజ్ క్రియేట్ అయిందో తెలియనిది కాదు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. పుష్ప 2 కి కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. కర్ణాటకలో పుష్ప సినిమాను బాయ్ కాట్ చేస్తున్నారట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Swetha
పుష్ప2 సినిమా కోసం వరల్డ్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా అంత హడావిడి స్టార్ట్ అవ్వలేదు. ఒక్కసారి ట్రైలర్, మిగిలిన సాంగ్స్ కనుక రిలీజ్ అయితే.. అసలైన బజ్ అప్పుడు మొదలవుతుంది. సినిమా రిలీజ్ కి ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో అటు మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి అప్డేట్స్ ఇవ్వడమే లేట్. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అంతా బాగానే కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు పుష్ప 2 కి ఓ కొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటంటే కర్ణాటకలో పుష్ప 2 సినిమాను బాయ్ కాట్ చేస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఈ న్యూస్ రావడం వెనుక కారణం లేకపోలేదు.
రీసెంట్ గా దీపావళి సమయంలో భగీర అనే కన్నడ మూవీ తెలుగులో రిలీజ్ అయింది. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మాస్, యాక్షన్, థ్రిల్లర్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ ఇది. కొన్ని సీన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మూవీకి మంచి రెస్పాన్స్ ఏ దక్కింది. మొదట ఈ సినిమాకు 200 స్క్రీన్స్ ఇచ్చారు. కానీ అదే సమయంలో ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా కంటే కూడా ఆ సినిమాలకు రెస్పాన్స్ ఎక్కువ రావడంతో.. క్రమంగా భగీర సినిమాకు షోస్ తగ్గిపోయాయి. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేకపోవడం వలన.. వేరే ఆప్షన్ లేక భగీర సినిమాకు స్క్రీన్ తగ్గాయి . దీనితో ఇప్పుడు త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కు రెడీ గా ఉండడంతో.. ఈ వివాదం మొదలైంది. ఇక్కడ కన్నడ హీరోకు స్క్రీన్స్ తగ్గించిన కారణంగా.. అక్కడ పుష్ప 2 మూవీకి బాయ్ కాట్ ట్రెండ్ ను మొదలుపెట్టారు.
నిజానికి ఒకవేళ బఘీర సినిమా కనుక సోలో గా కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అయితే.. ఇక్కడ కూడా బాగానే క్లిక్ అయ్యేది. ఎందుకంటే గతంలో ఎన్నో కన్నడ సినిమాలను తెలుగు వారు ఆదరించారు. కథలో కంటెంట్ ఉంటె తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ప్రేమిస్తారన్న సంగతి తెలియనిది కాదు. కాకపోతే ఇప్పుడు అదే సమయంలో మరో మూడు సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ వివాదం తలెత్తేంది. గతంలో కూడా ఓసారి భాషను అవమానిస్తున్నారంటూ పుష్ప పార్ట్ 1 రిలీజ్ టైం లో ఇలాంటి అడ్డంకులే వచ్చాయి. కానీ కట్ చేస్తే సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలానే ఈసారి కూడా ఎలాంటి అడ్డంకులు వచ్చినా తగ్గేదే లే అంటూ పుష్ప 2 మూవీ.. దూసుకుపోతోందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పార్ట్ 2 మీద అయితే హైప్ బాగానే కొనసాగుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.