ఒక సినిమా ఫలితం బట్టి.. దాని సీక్వెల్ అంటూ వచ్చే సినిమాలపై అంచనాలతో పాటు బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతుంటుంది. అందులోనూ పాన్ ఇండియా సినిమాలైతే ఖచ్చితంగా వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ అలాంటి హైప్ క్రియేట్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప. 2021లో పాన్ ఇండియా మూవీగా పుష్ప విడుదలై ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక పుష్పరాజ్ గా అల్లు అర్జున్.. క్యారెక్టర్ లో ఒదిగిపోయిన తీరుకు, ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. వెరసి.. పుష్ప మేనియా ఏకంగా వరల్డ్ వైడ్ పాకేసింది. ఇతర దేశాలకు చెందిన ఫేమస్ పర్సనాలిటీస్ సైతం పుష్పరాజ్ మార్క్ యాటిట్యూడ్ ని చేసి చూపించారు. మొత్తానికి సినిమాకు ఊహించని బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఆ బజ్ కాస్త ఇప్పుడు పుష్ప సీక్వెల్ పై అంచనాలు పెంచేలా చేసింది. తగ్గేదేలే అంటూ బన్నీ చూపించిన యాటిట్యూడ్ షాట్ కి ఫ్యాన్ బేస్ చాలా ఉంది. అందులోనూ రీసెంట్ గా పుష్పరాజ్ క్యారెక్టర్ కి గాను.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు.
అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో.. పుష్ప సీక్వెల్ కాస్త వరల్డ్ వైడ్ మరోసారి మార్మోగిపోయింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాకు మేకింగ్ దశలోనే ఊహించని ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ వివరాల్లోకి వెళ్తే.. పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్లు ఆఫర్ చేసిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. పుష్ప 2కి సంబంధించి అన్ని రకాల హక్కుల కోసం అంత మొత్తం ఆఫర్ చేసిందని అంటున్నారు. కాగా.. పుష్ప మేకర్స్ మాత్రం ఆఫర్ విషయంలో రియాక్ట్ అవ్వకుండా.. ఇంకా హై ప్రైస్ ని అంచనా వేస్తున్నారని వినికిడి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు గానీ.. బాలీవుడ్ లో కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి పుష్ప 2 విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.