iDreamPost
android-app
ios-app

Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్.. రూమర్లకు చెక్

  • Published Aug 05, 2024 | 1:16 PM Updated Updated Aug 05, 2024 | 1:16 PM

ఈ ఏడాది మలి సగంలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా నిలుస్తుంది పుష్ప 2. డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఈ మధ్య కాలంలో బన్నీ-సుక్కు మధ్య వర్క్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో మరోసారి మూవీ వాయిదా పడొచ్చునన్న గాసిప్స్..

ఈ ఏడాది మలి సగంలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా నిలుస్తుంది పుష్ప 2. డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఈ మధ్య కాలంలో బన్నీ-సుక్కు మధ్య వర్క్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో మరోసారి మూవీ వాయిదా పడొచ్చునన్న గాసిప్స్..

  • Published Aug 05, 2024 | 1:16 PMUpdated Aug 05, 2024 | 1:16 PM
Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్.. రూమర్లకు చెక్

పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు.. జాతీయ అవార్డును కొల్లగొట్టిన నటుడు అల్లు అర్జున్. అప్పుడే తెరపై కనిపించి మూడేళ్ల దాటి పోయింది. పుష్ప 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రం.. మరోసారి డిసెంబర్ బరిలో నిలుస్తుంది. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తుంది టీం. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 6న డేట్ లాక్ చేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని రూమర్ల కారణంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. సుకుమార్- బన్నీ మధ్య వర్క్ డిఫరెన్సెస్ వచ్చాయని, షూటింగ్, కథ విషయంలో అర్జున్ జోక్యం ఎక్కువైందని, వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని టాక్ నడిచింది. దీంతో షూటింగ్ పోస్టుపోన్ అవుతుందని, డిసెంబర్‌కు కూడా డౌటేనంటూ ఇన్నర్ టాక్ గట్టిగానే నడిచింది.

ఈ గాసిప్స్‌కు ఆజ్యం పోస్తూ అల్లు అర్జున్ గడ్డం తీసేయడం.. కొంత మంది వాదనకు బలాన్నిచ్చినట్లయ్యింది. అయితే దీనిపై బన్నీ వాసు ఈ మధ్య కాలంలో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే షూటింగ్ జరుగుతుందని, అనారోగ్య సమస్యలు రాకపోతే తప్ప.. ఈ సినిమా డిసెంబర్‌లో అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం పక్కా అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అయ్యే వార్త అందించింది పుష్ప టీం. షూటింగ్ అప్డేట్ అంటూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంది. పుష్ప2.. ద రూల్..క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 6న వరల్ట్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. గంగమ్మ జాతరలో విలన్లను తుక్కు తుక్కు తన్నిన పుష్ప షార్ట్ వీడియోను జత చేసింది. దీంతో రూమర్లకు చెక్ పడినట్లైంది.

పుష్ప 2 రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులు..మరోసారి మూవీ విడుదలపై క్లారిటీ రావడంతో పండుగ చేసుకుంటున్నారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫహాద్ ఫజిల్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. రూ. 500 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లెక్కల మాస్టారు సుకుమార్.. పక్కా ప్లాన్‌తో కమర్షియల్ మూవీకి కావాల్సిన హంగులు దిద్దుతున్నాడట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ బాధ్యతలను కూడా చక చకా చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఫహాద్ ఫజల్, జగదీప్ ప్రతాప్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ, అజయ్, బ్రహ్మాజీ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్న సంగతి విదితమే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetpasacasinocasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabethızlıcasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom