Swetha
ఒకప్పుడు ఇండస్ట్రీ మనకు అవసరమా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న.. ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్విని దత్ .. ఇప్పుడు నక్క తోక తొక్కి లాభాల బాటలో కొనసాగుతున్నారని చెప్పి తీరాల్సిందే. అసలు ఏమైందంటే..
ఒకప్పుడు ఇండస్ట్రీ మనకు అవసరమా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న.. ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్విని దత్ .. ఇప్పుడు నక్క తోక తొక్కి లాభాల బాటలో కొనసాగుతున్నారని చెప్పి తీరాల్సిందే. అసలు ఏమైందంటే..
Swetha
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది. ఈ విషయం ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరుతారు. ఎందుకంటే.. ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి పరిణామాలు తెచ్చిపెడుతుందో ఎవరు ఊహించలేరు. కొన్ని సార్లు భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన సినిమాలు సైతం.. అనుకోని విధంగా ప్లాప్ అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సార్లు తక్కువ బడ్జెట్ తో.. ఎటువంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. ఆ సినిమాలు భారీ కలెక్షన్స్ తెచ్చిపెడతాయి. అయితే ఏదైనా ఓ సినిమా హిట్ అయితే.. దానికి సంబంధించిన ఫలితాలు అందరిని ఆనందపరుస్తాయి. కానీ మూవీ ప్లాప్ అయితే మాత్రం దాని పరిణామం ముఖ్యంగా నిర్మాణ సంస్థల మీద.. ప్రొడ్యూసర్స్ మీద పడుతుందని చెప్పి తీరాల్సిందే. ఈ క్రమంలో ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీనే వదిలేసి వెళ్ళాలి అనుకున్న నిర్మాత అశ్విని దత్.. ఇప్పుడు లాభాల బాట పడుతున్నారని చెప్పి తీరాల్సిందే.
టాలీవుడ్ స్టార్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్. ఇప్పటివరకు చాలానే భారీ బడ్జెట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు అశ్విని దత్. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఆయనకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దీనితో ఆ సమయంలో ఏకంగా ఇండస్ట్రీనే వదిలి వెళ్దాం అనుకున్నారట అశ్విని దత్. ఒకవేళ అదే జరిగి ఉంటే కనుక.. ఈరోజు ఇంత సక్సెస్ ను మిస్ అయ్యారేమో.. అలా చేయకుండా అన్ని పరిస్థితులను దాటుకుని.. ఈరోజు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే.. ఈరోజు కల్కి సినిమా విషయంలో ఇంత పెద్ద సక్సెస్ చూడగలుగుతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ను బద్దలుకొడుతుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ఇన్ని రోజులు అయినా.. థియేటర్స్ లో ఇంకా అదే జోరు కొనసాగుతూ ఉంది. ఊహించినట్లుగానే ఈ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పించింది. మెప్పించడమే కాకుండా.. పురాణ ఇతిహాసాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా కూడా చేసింది ఈ సినిమా. ఇదిలా ఉంటె.. ఇప్పుడు కల్కి మూవీ నిర్మాత అశ్విని దత్ కు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. దాదాపు ఈ సినిమా నుంచి అశ్విని దత్ కు రూ.90 కోట్ల లాభాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా సినిమా క్రేజ్ ఎక్కడా తగ్గలేదు కాబట్టి.. త్వరలో రూ.100 కోట్ల లాభం వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. కల్కి మూవీ విషయంలో రిస్క్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు అశ్విని దత్.. ఈ లాభాలను చూడగలుగుతున్నారు. కథపై నమ్మకం ఉంటే చాలు లాభాలు దానంతట అవే వస్తాయని అశ్విని దత్ ప్రూవ్ చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.