iDreamPost
android-app
ios-app

ప్రేమలుకి సీక్వెల్.. ఇది మంచి ఆలోచనే! కానీ.. ఆదరిస్తారా?

  • Published Apr 20, 2024 | 3:56 PM Updated Updated Apr 20, 2024 | 3:56 PM

మలయాళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టి. . తెలుగులోనూ మంచి మార్కులు వేయించుకున్న మూవీ ప్రేమలు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుంది. మరీ ఈ సినిమా వర్కౌట్ అవుతుందా..?

మలయాళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టి. . తెలుగులోనూ మంచి మార్కులు వేయించుకున్న మూవీ ప్రేమలు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుంది. మరీ ఈ సినిమా వర్కౌట్ అవుతుందా..?

  • Published Apr 20, 2024 | 3:56 PMUpdated Apr 20, 2024 | 3:56 PM
ప్రేమలుకి సీక్వెల్.. ఇది మంచి ఆలోచనే! కానీ.. ఆదరిస్తారా?

ఈ ఏడాది బాక్సాఫీసును షేక్ చేసేశాయి మాలీవుడ్ సినిమాలు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి బ్రహ్మయుగం ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లను కొల్లగొట్టింది. అలాగే మరో స్టార్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ గోట్ చిత్రం కూడా వంద కోట్లను దాటి రూ. 200 కోట్ల కలెక్షన్ల వైపుకు పరుగులు పెడుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. ట్రెమండస్ రెస్పాన్స్ మాత్రమే కాదు.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్. అయితే ఇందులో ఎటువంటి ట్విస్టులు, టర్నింగ్ లేకుండా మెప్పించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేమలు. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించింది.

గిరీశ్ ఎడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నస్లెన్ కె గఫూర్, మమితా బైజూ, మ్యాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ విడుదల చేసిన సంగతి విదితమే. తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇటీవల ఓటీటీలోకి కూడా వచ్చి అదిరిపోయే వ్యూస్ రాబట్టుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. ప్రేమలు 2 పేరుతో రిలీజ్ అవుతున్నట్లు ప్రీ లుక్ లాంటి పోస్టర్‌తో అఫీషియల్ ఎనౌన్స్ చేశారు. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.  దీన్ని కూడా తెలుగులో కార్తికేయనే అందించబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే యాక్షన్, థ్రిల్లింగ్, క్రైమ్ కథలకు సీక్వెల్ తీయడం పెద్ద రిస్క్ అనిపించదు.

Premalu2

కానీ లవ్ డ్రామాకు కొనసాగింపుగా సినిమా తెరకెక్కించడం అంటే కత్తిమీద సాము లాంటింది. ఇప్పటి వరకు రొమాంటిక్ లవ్ స్టోరీలకు సీక్వెల్స్ వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే.. ఈ ప్రేమలు 2 తీయడం దర్శకుడికి పెను సవాలే. ఎండింగ్ స్టోరీకి కొత్త కథ చెప్పడమో లేదా ఆ లవ్ డ్రామాను కొనసాగించడేమో జరగాలి.  అయితే ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ ఇప్పుడు హైదరాబాద్ నుండి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ మార్పులు కూడా చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేమలు మించిన ఫన్ అండ్ లవ్, రొమాంటిక్‌గా తెరకెక్కించనున్నట్లు మాత్రం తెలుస్తోంది. యూత్‌ను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం.  దీన్ని ఆదరిస్తురా లేదా అనేది తెలియదు.  ఇది కనుక సక్సెస్ అయితే.. సక్సెస్ అయిన ఎన్నో ప్రేమ కథా చిత్రాలకు ప్రాణం పోసిన సినిమాగా మారడం ఖాయం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom