iDreamPost
android-app
ios-app

స్పిరిట్ లో సర్ ప్రైజ్.. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించనిదే!

Prabhas Spirit Movie: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఈక్రమంలో ఈ సినిమా ను సర్ ప్రైజ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

Prabhas Spirit Movie: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఈక్రమంలో ఈ సినిమా ను సర్ ప్రైజ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

స్పిరిట్ లో సర్ ప్రైజ్.. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించనిదే!

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో భారీ హిట్ కొట్టాడు. 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి చాలా రికార్డులు సృష్టించాడు. కల్కి విజయంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కల్కి విజయంతో ప్రభాస్ వరుసగా రెండు భారీ హిట్‍లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సలార్ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసింది.  ఆ తరువాత కల్కి 2898 ఏడీ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నసంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి..అసలు సర్ ప్రైజ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేశాడు. ఆ తరువాత హిందీలో ను అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే.. సందీప్ రెడ్డి గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తీవ్రమైన విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇది ఇలా ఉంటే సందీప్ తదుపరి సినిమా ప్రభాస్ తో చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఓ రేంజ్ లో ఉంది.

ఇక ఈ సినిమాలో మోస్ట్ పవర్ పుల్ పోలీస్ అధికారిగా ప్రభాస్ నటిస్తారనే సందీప్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసింది. దీంతో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. ఇదే ట్విస్ట్ అంటే.. ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉన్నట్లు క్రేజీ రూమర్ ఒకటి బయటకు వచ్చింది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తారనే టాక్ తాజాగా బయటికి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ చేయనున్న ఓ పాత్ర నెగెటివ్‍గాను మరోకటి పాజిటివ్‍గా ఉండనుందని తెలుస్తోంది. అయితే, సందీప్ ఇప్పటికే చెప్పిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ రెండింట్లో ఎలా ఉంటుందనేది ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులకు ఆసక్తిని పెంచేసేంది.

ప్రస్తుతం స్పిరిట్‍లో ప్రభాస్ డబల్ రోల్ అనే విషయంపై రూమర్లు మాత్రమే వస్తున్నాయి. అధికారికంగా మాత్రం స్పిరిట్ టీమ్ నుంచి ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ మూవీని తన మార్క్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సందీప్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయర్ లో అనే రూమర్ డార్లింగ్ ఫ్యాన్స్ కు కూడా ఊహించని సర్ ఫ్రైజ్ అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్‍ను చూస్తారని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి