iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ క్రిటిక్స్ పై కల్కి టీమ్ రూ.25 కోట్లు పరువునష్టం దావా!

  • Published Jul 19, 2024 | 12:36 PM Updated Updated Jul 19, 2024 | 12:36 PM

Kalki 2898 AD: వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా కలక్షన్స్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన చిత్ర బృందం తాజాగా ఆ క్రిటిక్స్ పై లీగల్ నోటిసుతో పాటు పరువు నష్టం దావా వేశారు.

Kalki 2898 AD: వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా కలక్షన్స్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన చిత్ర బృందం తాజాగా ఆ క్రిటిక్స్ పై లీగల్ నోటిసుతో పాటు పరువు నష్టం దావా వేశారు.

  • Published Jul 19, 2024 | 12:36 PMUpdated Jul 19, 2024 | 12:36 PM
బాలీవుడ్ క్రిటిక్స్ పై కల్కి టీమ్ రూ.25 కోట్లు పరువునష్టం దావా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా రిలీజై దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇకపోతే ఈ కల్కి సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన విషయం తెలిసిందే.అలాగే కమర్షియల్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా కల్కి మూవీ రిలీజైన సమాయానికి థియేటర్లలో కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో.. ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కల్కి సినిమా కోసం థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో సింగల్ స్క్రీన్స్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ వరకు కాసుల వర్షం కురిపించింది.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలై నెల రోజులు గడవక ముందే దాదాపు రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఈజీగా చేరిపోయింది. ఇక కల్కి సినిమాలో భాగమైన స్టార్ నటి, నటులు కూడా అద్భుతంగా నటించారు. ఇలా వరల్డ్ వైడ్ గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కల్కి సినిమాపై మరో వైపు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. ముఖ్యంగా కొంతమంది కావలనే కల్కి సినిమా కలెక్షన్స్ పై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎట్టాకేలకు స్పందించిన కల్కి మూవీ బృందం వారిపై పరువు నష్టం దావా వేసింది. ఆ వివరాళలేంటో చూద్దాం. కల్కి సినిమా పై గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కు చెందిన కొంతమంది క్రిటిక్స్  కల్కి మూవీ కలెక్షన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే బాలీవుడ్ క్రిటిక్స్ ఇలా తెలుగు సినిమాలపై తప్పుడు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు.

ఎందుకంటే.. గతంలో కూడా యానిమల్ సినిమా విషయంలో కూడా బాలీవుడ్ క్రిటిక్స్ తెలుగు సినిమాపై తమ చులకనగా చూస్తూ.. కామెంట్స్ చేశారు. దీనిపై దర్శకుడ సందీప్ రెడ్డి వంగా కూడా తనదైన శైలిలో నెగిటివ్ ప్రచారం చేసే వారి నోరు మూయించాడు.  బహుశ ఒక తెలుగు సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించడం బాలీవుడ్ లో మింగుడపడటం లేదో ఏమో తెలియదు కానీ, రాను రాను తెలుగు సినిమాపై నెగిటివ్ టాక్ ప్రచారం చేసే క్రిటిక్స్ ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే..  బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామి సృష్టించిన కల్కి మూవీ పై కలెక్షన్స్ పై కూడా బాలీవుడ్ క్రిటిక్స్ తమ అక్కసును చూపించారు. దీంతో ఈ ఫేక్ ప్రచారం పై స్పందించిన కల్కి మూవీ బృందం తాజాగా రియాక్ట్ అయ్యి లీగల్ నోటిసులు ఇచ్చింది. అంతేకాకుండా.. ఏకంగా రూ.25 కోట్ల పరువునష్టం దావా కూడా వేశారు.

ఇఅలాగే ల్కి 2898 AD’ కలెక్షన్స్ నకిలీవని అని చెప్పడానికి ఇద్దరూ సరైనా సాక్షాలు సమర్పించాలి. అలాగే సినిమా ఎంత వసూళ్లు చేసిందనేది కూడా చూపించాలి పేర్కొన్నారు. దీంతో మొదటిసారి ఈ క్రిటిక్ రాయులపై స్పందించిన కల్కి మూవీ నిర్మాతాలు తీసుకున్న నిర్ణయం పై నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో వసూళ్లు చేసేలా ఉందనే టాక్ ప్రస్తుతం జోరుగా వినిపిస్తుంది. మరి, కల్కి సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తున్న క్రిటిక్స్ పై చిత్ర బృందం పరువు నష్టం దావా వేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş