iDreamPost
android-app
ios-app

భారీగా ‘కల్కి2898AD’ మూవీ టికెట్ ధరలు! అక్కడ వేలల్లో..!

Kalki 2898AD Ticket Prices: ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా కల్కి2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ల ధరలు భారీగా ఉన్నాయి.  అయితే సినిమాపై ఉన్న అంచనాలతో ధరలు సైతం లెక్కచేయకుండా టికెట్లు బుకింగ్ చేస్తున్నారు.

Kalki 2898AD Ticket Prices: ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా కల్కి2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ల ధరలు భారీగా ఉన్నాయి.  అయితే సినిమాపై ఉన్న అంచనాలతో ధరలు సైతం లెక్కచేయకుండా టికెట్లు బుకింగ్ చేస్తున్నారు.

భారీగా ‘కల్కి2898AD’ మూవీ టికెట్ ధరలు! అక్కడ వేలల్లో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  తాజా చిత్రం కల్కి 2898ఏడీ. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లు కనిపించింది. దీంతో  ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కల్కి2898 ఏడీ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. ఇదే సమయంలో టికెట్ రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు వచ్చిన సంగతి తెలిసింది. ఇదే సమయంలో ఓ ప్రాంతంలో టికెట్ ధరలు వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా కల్కి2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ల ధరలు భారీగా ఉన్నాయి.  సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో మల్టీప్లెక్స్ లలో  ఈ సినిమాను చూడాలంటే కనీసం 500 టికెట్ కి ఖర్చుపెట్టాల్సిందే. అదే సింగిల్ థియేటర్స్ ల్లలో అయితే 200 నుంచి 300 వరకు  ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగానే ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి మహా నగరాల్లో మల్టీప్లెక్స్ లలో విడుదల రోజు టికెట్ ధరలు వేలల్లో ఉంటాయి.

అలానే విశ్వసనీయ వర్గాల సమచారాం ప్రకారం కల్కి సినిమాకు కూడా టికెట్ ధర వేలల్లో ఉందని తెలుస్తోంది. ముంబైలో రిలీజ్ రోజు మల్టీఫ్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కొక్క టికెట్ ధర రూ.2000 ఉన్నట్లు సమాచారం. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్ లో  అయితే 3వేల రూపాయల వరకు ఉందట. ఇక పోతే ఢిల్లీ నగరంలో మల్టీప్లెక్స్ లో 1300 నుంచి 2000 వరకు కల్కి2898 ఏడీ సినిమా టికెట్ ధరలు ఉన్నాయని తెలుస్తోంది. అదే విధంగా గ్రీన్ సిటీ బెంగళూరులో కల్కి విడుదల రోజు టికెట్స్ మల్టీప్లెక్స్ లలో 1100 నుంచి 1500 వరకు ఉన్నాయి.

హైదరాబాద్ లో అయితే బెనిఫిట్ షోకి కొంతమంది 3వేలరూపాయలకు కల్కి టికెట్స్ బ్లాక్ లో అమ్ముతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. టికెట్ రేటు ఎంత ఉన్నా ప్రభాస్ మీద అభిమానంతో, కల్కి మీద ఉన్న అంచనాలతో అటు ఫ్యాన్స్ , ఇటు సినీ ప్రియులు టికెట్లు తెగ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓపెన్ చేసిన అన్ని థియేటర్స్ రిలీజ్ రోజు హౌస్ ఫుల్ చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తేంటే కల్కి సినిమా కలెక్షన్స్ భారీగానే వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి