iDreamPost
android-app
ios-app

కల్కి ఎవరో కాదు ప్రభాసే.. ఫ్యాన్స్ ఎగిరి గంతేసే ట్విస్ట్ ఇది!

Prabhas Is Kalki- kalki 2898 AD Movie: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కల్కి కాదు అనే పాయింట్ ని మాత్రం తీసుకోలేకపోతున్నారు. కానీ, కల్కి ప్రభాసే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

Prabhas Is Kalki- kalki 2898 AD Movie: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కల్కి కాదు అనే పాయింట్ ని మాత్రం తీసుకోలేకపోతున్నారు. కానీ, కల్కి ప్రభాసే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

కల్కి ఎవరో కాదు ప్రభాసే.. ఫ్యాన్స్ ఎగిరి గంతేసే ట్విస్ట్ ఇది!

కల్కి 2898 ఏడీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు.. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్లుగానే కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ అంటూ ఇప్పటికే ఇన్ సైడ్ టాక్, సెన్సార్ రివ్యూలు వచ్చేశాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. సినిమా గురించి ఫ్యాన్స్ కి ఎలాంటి కంగారు లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు. కానీ, ఆ సినిమాలో కల్కి ప్రభాస్ కాదు అనే మాటను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కల్కి ప్రభాస్ కాకపోతే ఎలా అంటూ తెగ ఫీలైపోతున్నారు. అయితే సినిమాలో కల్కి ప్రభాస్ అనే విషయం మీకు తెలుసా? తాజాగా నెట్టింట వస్తున్న గాసిప్స్ చూస్తే మాత్రం ఆ ఊహ నెక్ట్స్ లెవల్లో ఉంది. మరి.. నెట్టింట వైరల్ అవుతున్న ఆ కథనాల ప్రకారం ప్రభాస్ కల్కి ఎలా అవుతాడో చూద్దాం.

కల్కి 2898 ఏడీ సినిమాలో మొత్తం మూడు నగరాలు ఉన్నాయి. ఒకటి కాశీ, రెండు కాంప్లెక్స్, మూడు శంబాలా. కాశీలో ప్రభాస్ ఉంటాడు. కాంప్లెక్స్ లో కలి ఉంటాడు. శంబాలాలో అశ్వత్థామ ఉంటాడు. కాశీ, శంబాలాలో ఉండే వారి జీవితాలు మారాలి అంటే కచ్చితంగా కల్కి రావాల్సిందే. కల్కి వస్తేనే అశ్వత్థామకు కూడా విముక్తి ఉంటుంది. అలాంటి కల్కి కోసం వీళ్లు మాత్రమే కాదు.. కాంప్లెక్స్ లో ఉన్న కలి కూడా ఎదురు చూస్తున్నాడు. కల్కి సాధారణంగా పుట్టే వరకు ఆగలేక కలి తన ల్యాబ్ లో స్త్రీలపై ప్రయోగాలు చేస్తున్నాడు. మహిళలపై ప్రయోగాలు చేసి కల్కిని పుట్టించాలని.. కల్కి శక్తులు తన వశం చేసుకోవాలి అని చూస్తుంటాడు. ఎన్నిసార్లు ప్రయోగాలు చేసినా కల్కి జననం మాత్రం సంభవం కాలేదు.

Kalki is Prabhas

ఆ ల్యాబ్ లో ఏం జరుగుతోంది అనే విషయాన్ని గమనించిన సుమతి(సమ్ 80) అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత ఆమె అశ్వత్థామ సాయంతో శంబాలా నగరానికి చేరుకుంటుంది. అక్కడే తన బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటుంది. అయితే సుమతిని ఎలాగైనా తీసుకురావాలి అని కమాండర్ మానస్ పెద్ద బౌంటీ ప్రకటిస్తాడు. అప్పుడే భైరవ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఎలాగైనా సుమతి తీసుకెళ్లి మిలియన్ యూనిట్స్ తో కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వాలి అనేది భైరవ ప్లాన్. అందుకు అశ్వత్థామతోనే యుద్ధానికి దిగుతాడు. భైరవతో యుద్ధం చేసే సమయంలో అతని సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమవుతుంది. అయితే దీపిక గర్భంలో ఉన్న బిడ్డకు ప్రమాదం జరగడంతో అశ్వత్థామ ఆ శక్తులను భైరవకు ట్రాన్స్ ఫర్ చేస్తాడు. మొదటి భాగం ఎండింగ్ లో భైరవ కల్కిగా మారతాడు. ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమవుతాడు. అక్కడితో మొదటి పార్ట్ ముగుస్తుంది.

సినిమా రెండో భాగంలో కలి vs కల్కి(భైరవ) ఉంటుంది. ఆ పార్ట్ లో కథ మరో స్థాయికి వెళ్లిపోతుంది. ఇదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల సారాశం. మొత్తానిక ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడకుండా ఉండేలా ఒక మంచి గాసిప్ అయితే వైరల్ అవుతోంది. ఇంత వరకు చాలా కన్విన్సింగ్ గానే ఉంది. అయితే కల్కి చనిపోతాడు అనేదే కాస్త స్వీకరించలేకుండా ఉంది. కల్కి ఆ మహావిష్ణువు పదో అవతారం అంటారు. అలాంటి అవతారాన్ని చనిపోయినట్లు చూపించడం అంటే పురాణాలను తప్పుబట్టడం అవుతుంది. అయితే అసలు కల్కి ఎవరో తెలియాలి అంటే మీరు జూన్ 27 వరకు ఆగాల్సిందే. మరి.. ప్రభాసే కల్కి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి