iDreamPost
android-app
ios-app

ప్రభాస్ డ్యూయెల్ రోల్.. ఒకటి సలార్, మరి రెండోది?

  • Author ajaykrishna Published - 02:49 PM, Fri - 29 September 23
  • Author ajaykrishna Published - 02:49 PM, Fri - 29 September 23
ప్రభాస్ డ్యూయెల్ రోల్.. ఒకటి సలార్, మరి రెండోది?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ మధ్యకాలంలో మోస్ట్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా సలార్ రికార్డు నమోదు చేసింది. హై యాక్షన్ మూవీగా రూపొందుతున్న సలార్ ని.. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో.. వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే టీజర్ తో, పోస్టర్ లతో సలార్ మూవీ అంచనాలు రెట్టింపు చేసేసింది. పైగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. దాదాపు ఏడాదికి పైగా ఆశతో ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అలాంటిది రీసెంట్ గా వాయిదా పడి నిరాశ పరిచింది.

హోంబలే ఫిలిమ్స్, ప్రశాంత్ నీల్ పై నమ్మకంతో ఫ్యాన్స్ ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. సెప్టెంబర్ 28 నుండి వాయిదా పడిన సలార్ మూవీ.. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఇలాంటి తరుణంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. సలార్ లో ప్రభాస్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడని ఆ వార్తల సారాంశం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సలార్ లో ప్రభాస్ రెండు క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడట. అందులో ఒకటి సలార్ కాగా.. రెండో క్యారెక్టర్ పేరు దేవా అని తెలుస్తుంది. వీటిలో సలార్ తండ్రి కాగా.. దేవా కొడుకు అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో గానీ.. సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం విదితమే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ కానుందో చూడాలి. ఇక ఈ మోస్ట్ హైప్డ్ మూవీకి.. కేజీఎఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, కెమెరా మెన్ భువన్ గౌడ వర్క్ చేస్తున్నారు. స్టార్స్ శృతిహాసన్, మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom