iDreamPost
android-app
ios-app

Salaar: 6 ఏళ్ళ ఆకలి తీర్చిన సలార్. ఇది రెబలోడి ఊచకోత!

  • Published Dec 22, 2023 | 10:57 AM Updated Updated Dec 22, 2023 | 11:18 AM

సలార్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్లో రీసౌండింగ్ ఇస్తున్న పేరు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. సాధారణంగానే డార్లింగ్ ప్రభాస్ సినిమా అన్నా.. ప్రశాంత్ నీల్ మూవీ అన్న సినిమా ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు.

సలార్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్లో రీసౌండింగ్ ఇస్తున్న పేరు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. సాధారణంగానే డార్లింగ్ ప్రభాస్ సినిమా అన్నా.. ప్రశాంత్ నీల్ మూవీ అన్న సినిమా ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు.

  • Published Dec 22, 2023 | 10:57 AMUpdated Dec 22, 2023 | 11:18 AM
Salaar: 6 ఏళ్ళ ఆకలి తీర్చిన సలార్. ఇది రెబలోడి ఊచకోత!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్​ షోలతో పాటు మన దేశంలో బెనిఫిట్ షోస్​కూ ఆడియెన్స్​ ఎగబడ్డారు. ప్రపంచ నలుమూల నుంచి ప్రభాస్ కొత్త సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ‘సలార్’లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్సులు, ఇంటర్వెల్ బ్యాంగ్, పార్ట్​-2 ఎలా ఉండబోతోందో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపించిన విధానం హైలైట్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్​తో రికార్డులను సృష్టించిన ‘సలార్’ మౌత్ టాక్ మరింత స్ట్రాంగ్​గా ఉంటే మొదటి వారంలోనే మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఈ ఫిల్మ్​కు సంబంధించిన ఓ అంశం వైరల్​గా మారింది. ప్రభాస్ అభిమానులు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న ఆకలి సలార్ తీర్చేసిందని  సంబర పడుతున్నారు. ఇది కదా రెబలోడి ఊచకోత అంటే అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

పాన్ ఇండియా సెన్సేషన్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కెజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సలార్. సరిగ్గా.. ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లేకుండానే.. ఇండియాని షేక్ చేసింది.  ఈ క్రేజీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ 6 ఏళ్ల తరువాత సాలీడ్ హీట్ అందుకున్నాడు. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. అంతకముందు వరకు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.

ఇక బాహుబలి సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అనేక రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. బాక్సాఫీస్ పై బాహుబలి దండయాత్ర చేసింది. ప్రభాస్, రానా నటించిన బహుబలి సిరీస్ లో  2015, 2017లో విడుదలయ్యాయి. బహుబలి -2 2017ఏప్రిల్ 28న విడుదలైంది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించి. ప్రభాస్ క్రేజ్, రాజమౌళి డైరెక్షన్ తో ఈ సినిమా భారతీయ  చలన చిత్రాల్లో టాప్ లో నిలబడింది. ఇంకా చెప్పాలంటే బాహుబలి సినిమా బాక్సాఫీస్ ను ఊచకోత కోసింది.

ఇక ఆ సినిమా వచ్చి దాదాపు 6 ఏళ్లు గడిచింది. ఈ మధ్యలో ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చిన.. అవి ప్రభాస్ అభిమానులు ఊహలను అందుకోలేక పోయాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ వచ్చిన క్రేజ్ కు ఈ సినిమాలు అందుకోలేకపోయాయి. అయితే సరిగ్గా ఆరేళ్ల తరువా తాజాగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్  సినిమాలో  ప్రభాస్ ఊచకోత కనిపించింది. ప్రభాస్ తో పాటు ఆయన అభిమానుల ఆరేళ్ల దాహం.. సలార్ మూవీతో తీరింది. ఇలాంటి సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానే ఎదురు చూశారు.

నేడు సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్  దుమ్ములేపుతుంది. సలార్ టాక్ బాగుంది కాబట్టి వీకెండ్ అయ్యే లోపు  ఓవర్సీస్ మార్కెట్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తాడు అనేది ఎదురు చూడాలి. మొత్తానికి ఈ సినిమా హిట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి  కొన్ని రోజుల ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతిని జరుపుకుంటున్నారు. మరి.. ఇలా ఆరేళ్ల తరువాత సలార్ మూవీతో రెబల్ స్టార్ ప్రభాస్ సృష్టించిన ఈ ప్రభజనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet