iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: మహానటిని టాలీవుడ్ లైట్ తీసుకున్నట్లేనా?

  • Published Dec 06, 2023 | 12:50 PM Updated Updated Dec 06, 2023 | 12:57 PM

మాలీవుడ్ లో గీతాంజలి మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తెలుగు, తమిళ సినిమాలు కూడా చేస్తూ మహానటి సినిమా ద్వారా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం తమిళ సినిమాలకే పరిమితం అయింది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. కొంత కాంగా తెలుగు సినిమాల్లో ఈమె పెద్దగా కనిపించడం లేదు.

మాలీవుడ్ లో గీతాంజలి మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తెలుగు, తమిళ సినిమాలు కూడా చేస్తూ మహానటి సినిమా ద్వారా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం తమిళ సినిమాలకే పరిమితం అయింది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. కొంత కాంగా తెలుగు సినిమాల్లో ఈమె పెద్దగా కనిపించడం లేదు.

  • Published Dec 06, 2023 | 12:50 PMUpdated Dec 06, 2023 | 12:57 PM
Keerthy Suresh: మహానటిని టాలీవుడ్ లైట్ తీసుకున్నట్లేనా?

తెలుగు ఇండస్ట్రీ నుంచి మరో హీరోయిన్ కనుమరుగు కనుమరుగవ్వబోతుందా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తోంది. హీరోయిన్ మరెవ్వరో కాదు మహానటి సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్. 2013లో రిలీజ్ మయాళ మూవీ గీతాంజలితో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగు లో నేను శైలజ సినిమాతో పరిచయం అయింది. తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో హరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇక మహానటి మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో కీర్తి సురేష్ కి మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగు హీరోయిన్స్ అంటే అందాల ప్రదర్శన చేయాల్సిందే. కానీ కీర్తి సురేష్ స్కిన్‌ షో చేయకున్నా కూడా తెలుగు లో మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే స్కిన్‌ షో చేయకుండా టాలీవుడ్‌ లో ఎక్కువ కాలం మనుగడ సాధించడం సాధ్యం కాదని గతంలో పలువురు హీరోయిన్స్ విషయంలో నిరూపితం అయ్యింది. ఇప్పుడు కీర్తి సురేష్‌ విషయంలో కూడా అదే నిజం అవ్వబోతుంది అనిపిస్తోంది.

మహేష్ బాబుకు జోడీగా నటించిన సర్కారు వారి పాట సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగు లో హీరోయిన్‌ గా కొత్త సినిమా ను కమిట్‌ అవ్వలేదు. చిరంజీవి చిత్రం భోళా శంకర్‌ లో చెల్లి పాత్రలో నటించడం వల్ల కీర్తి కెరీర్‌ మరింతగా ప్రమాదంలో పడ్డట్లు అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాల్లో కొన్ని కీర్తి సురేష్ కి లేవు అని, అయినా కూడా ఆమెకు ఆఫర్లు ఇన్నాళ్లు వచ్చాయి. కానీ ఇక ముందు ఆమె తెలుగు లో కమర్షియల్‌ హీరోయిన్‌ గా కొనసాగడం సాధ్యం అయ్యే పని కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు సూటబుల్‌ కానీ, తెలుగు హీరోల సరసన హీరోయిన్ గా అందాలు ఆరబోసే విషయంలో కరెక్ట్‌ కాదు అంటున్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్‌ నాలుగు సినిమాల్లో నటిస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆ అరడజను సినిమాలు కూడా తమిళ్ చిత్రాలే అవ్వడంతో కీర్తి సురేష్ కి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్లు రావడం లేదని తేలిపోయింది. కీర్తి సురేష్ తో ఈ దశలో స్కిన్‌ షో చేయించినా కూడా జనాలు చూసే అవకాశం లేదు. కనుక తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ కీర్తి సురేష్ ను లైట్‌ తీసుకుని ఉంటారు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ లో కీర్తి సురేష్ కొనసాగాలి అంటే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసుకోవాల్సిందే. మరి కీర్తి సురేష్ ఆ పాత్రలు చేస్తుందా అనేది చూడాలి. టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కీర్తి సురేష్ ను లైట్ తీసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్స్ అంటే స్కిన్‌ షో చేయాల్సిందే అని మీరూ భావిస్తున్నారా? ముందు ముందు టాలీవుడ్‌ లో కీర్తి సురేష్ కి కమర్షియల్‌ హీరోయిన్‌ గా ఛాన్స్ లు వచ్చేనా? అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom