Swetha
సంవత్సరమంతా ఆడియన్స్ సినిమాల కోసం ఎదురుచూసేది ఒకెత్తయితే.. ఒక్క OG కోసం ఆడియన్స్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎదురుచూసేది ఒకెత్తు. అంతలా OG జపం చేస్తున్నారు ప్రేక్షకులు. పైగా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రేంజ్ లో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు.

సంవత్సరమంతా ఆడియన్స్ సినిమాల కోసం ఎదురుచూసేది ఒకెత్తయితే.. ఒక్క OG కోసం ఆడియన్స్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎదురుచూసేది ఒకెత్తు. అంతలా OG జపం చేస్తున్నారు ప్రేక్షకులు. పైగా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రేంజ్ లో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. అలా అని బడా హీరోల సినిమాలు రాలేదని కాదు. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే మాదిరి బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ బోల్తా పడ్డాయి. అసలు ఈ హీరోకు తిరుగు లేదు బాక్స్ ఆఫీస్ వసూళ్లు పక్కా అని ఆశలు పెట్టుకుని సినిమాలకు వెళ్లిన వారు నిరాశగా తిరిగి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఓజి ఇస్తున్న హైప్ తో ఇవన్నీ తుడిచిపెట్టుకు పోయేలా ఉన్నాయి. సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో ఓజి రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే వస్తున్న అప్డేట్స్ తో ప్రేక్షకులు ఫుల్ శాటిస్ఫై అయినట్టే కనిపిస్తుంది. రిలీజ్ ముందు వరకు కూడా సినిమా నుంచి ఏవో ఒక అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కానీ వాటి అన్నిటికంటే కూడా సినిమాకు ట్రైలర్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్ ను సెప్టెంబర్ 15 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఒకవేళ ట్రైలర్ కూడా అంచనాలను అందుకుంటే మాత్రం.. ఫ్యాన్ బాయ్ సృష్టించిన సంభవంతో ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.