iDreamPost
android-app
ios-app

నివేద థామస్ మూవీ రిలీజ్ వాయిదా.. ‘పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి’!

  • Published Aug 12, 2024 | 3:15 PM Updated Updated Aug 12, 2024 | 3:29 PM

35-chinna katha kaadu Movie: టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా '35- చిన్న కథ కాదు'. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు.

35-chinna katha kaadu Movie: టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా '35- చిన్న కథ కాదు'. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు.

  • Published Aug 12, 2024 | 3:15 PMUpdated Aug 12, 2024 | 3:29 PM
నివేద థామస్ మూవీ రిలీజ్ వాయిదా.. ‘పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి’!

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతో పాపులర్ అయ్యి.. ఆ తర్వాత సరైన ఆఫర్లు లేక కొంతకాలం సినిమాలకు దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నివేద థామస్ కూడా ఒకరు. నివేదకు ఓ మంచి హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ప్రస్తుతం నివేద ’35- చిన్న కథ కాదు’ అనే మూవీలో.. మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అంతటా పాజిటివ్ బజ్ నెలకొంది. పైగా ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు మేకర్స్. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పోస్టర్ ను గమనిస్తే.. ఈ వారం ఈ సినిమా రిలీజ్ కష్టమే.. అసలు విషయం ఏంటో చూసేద్దాం.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆగష్టు 15 న రిలీజ్ అయ్యే చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఆయా సినిమాలకు విపరీతమైన బజ్ కూడా నెలకొంది. రవి తేజ మిస్టర్ బచ్చన్ , రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా.. అదే రోజున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నివేద థామస్ నటిస్తున్న సినిమా ’35- చిన్న కథ కాదు’ మూవీని కూడా మొదట ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు దానిని వాయిదా వేసినట్లు తాజాగా ఓ పోస్టర్ రూపంలో అనౌన్స్ చేశారు. “టీచర్ చెప్తే వినాలి.. రిలీజ్ తేది మారాలి..’’ అంటూ “పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి అదే ట్రెండ్” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు మేకర్స్. కాబట్టి ఆగష్టు 15 కైతే ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. త్వరలోనే మూవీ న్యూ రిలీజ్ పై అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం ఆగష్టు 15న హేవీ కాంపిటేషన్ ఉండడమే దీనికి కారణం అనిపిస్తుంది. 35చిన్న కథ కాదు మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటూ.. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా అయినా కూడా.. ఇప్పటికే భారీ హైప్ ఉన్న సినిమాల వలన.. ఈ సినిమాపై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ ను గమనిస్తే.. సెప్టెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. నివేద థామస్ తో పాటు.. విశ్వ, ప్రియదర్శి, గౌతమి లాంటి వారు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş