iDreamPost
android-app
ios-app

Sudigali Sudheer: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

  • Published Apr 28, 2024 | 1:56 PM Updated Updated Apr 28, 2024 | 1:56 PM

సుడిగాలి సుధీర్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రెటిగా ఎదిగాడు. మెజిషియన్ గా తన కెరీర్ మొదలు పెట్టి..నేడు ఫేమస్ యాక్టర్ గా మారాడు. ఇక ఆయన పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. తాజాగా సుధీర్ పెళ్లి, ఆయనకు కాబోయే అమ్మాయికి గురించి ఓ టాక్ వినిపిస్తోంది.

సుడిగాలి సుధీర్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రెటిగా ఎదిగాడు. మెజిషియన్ గా తన కెరీర్ మొదలు పెట్టి..నేడు ఫేమస్ యాక్టర్ గా మారాడు. ఇక ఆయన పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. తాజాగా సుధీర్ పెళ్లి, ఆయనకు కాబోయే అమ్మాయికి గురించి ఓ టాక్ వినిపిస్తోంది.

  • Published Apr 28, 2024 | 1:56 PMUpdated Apr 28, 2024 | 1:56 PM
Sudigali Sudheer: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

సినిమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే శుభకార్యాలు, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలానే హీరో,హీరోయిన్లు, ఇతర ప్రముఖ నటుల పెళ్లిళ్లకు సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రముఖ యాక్టర్, బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ పెళ్లి విషయం గురించి కూడా ఓ వార్త నెటింట్లో తెగ వైరల్ అవుతోంది. త్వరలో సుడిగాలి సుధీర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని టాక్. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ మెజిషియన్ గా  తన కెరీర్ ను మొదలు పెట్టి..నేడు బుల్లితెర సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు ఈ సుడిగాలి సుధీర్. కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది నటులను మనం చూసి ఉంటాము. అలాంటి వారిలో ఒకరు సుడిగాలి సుధీర్. సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీ స్థాయికి ఎదిరిగాడు. మెజిషియన్ గా చేస్తున్న సుధీర్ కెరీర్ ను జబర్దస్త్ మార్చేసింది. ఈ జబర్దస్త్ షో కారణంగా మాములు సుధీర్ కాస్తా..సుడిగాలి సుధీర్ గా గుర్తింపు పొందాడు. ఆ షోలోకి సాధారణ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ అయ్యాడు. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకలను అలరించే వాడు. అక్కడ వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా సుధీర్ మెరిశారు. పలు సినిమాలో హీరోగా నటించి.. మంచి మార్కులే వేయించుకున్నారు.

ఇక సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లు. వారిద్దరు కలిసి ఏ షో చేసిన సూపర్ హిట్ అయ్యేది. అలానే వారిద్దరిపై అనేక రూమర్స్ షికారు చేశాయి. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ చాలానే వినిపించాయి. కానీ వారు ప్రేమికులు కాదని స్నేహితులని తేలిపోయింది. అలా సుధీర్ వివాహం పై ఎప్పుడూ చర్చ కొనసాగుతోంది. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. త్వరలో సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. సుధీర్ పెళ్లి చేసుకోబోయే  అమ్మాయి ఫలానా అంటూ…కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సుధీర్ విదేశాల్లో చదువుతున్న తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వారి పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సుధీర్ కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా వివాహంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ అమ్మాయి చదువు పూర్తి కాగానే పెళ్లి చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో సుడిగాలి సుధీర్ పెళ్లి జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తోన్నాయి. మొత్తంగా ఇదే నిజం అయితే సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడు అవుతాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş