iDreamPost
android-app
ios-app

ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్-2 తో ఆగడం లేదా? దడ పుట్టించే వార్త!

  • Published Feb 15, 2024 | 1:44 PM Updated Updated Feb 15, 2024 | 1:44 PM

ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన "సలార్" సినిమా ఎలా ఉందో చూశాము. ఆ తర్వాత సలార్ పార్ట్ -2 కోసం కూడా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉండబోతుందంటూ.. మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన "సలార్" సినిమా ఎలా ఉందో చూశాము. ఆ తర్వాత సలార్ పార్ట్ -2 కోసం కూడా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉండబోతుందంటూ.. మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Feb 15, 2024 | 1:44 PMUpdated Feb 15, 2024 | 1:44 PM
ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్-2 తో ఆగడం లేదా? దడ పుట్టించే వార్త!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ గురించి ఇప్పటికి ఎక్కడో ఒక దగ్గర టాక్ నడుస్తూనే ఉంది. ఆ రేంజ్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను స్క్రీన్ పైన చూపించాడు మరి. కొంతకాలంగా ప్రభాస్ చిత్రాలతో వరుసగా నిరాశలో ఉన్న అభిమానులకు.. సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ తో.. అందరి నిరాశలను చల్లార్చేసి.. భారీ విజయంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత ఒకటొకటిగా ప్రభాస్ సినెమాలపైన అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీనితో అభిమానులలో ప్రభాస్ వరుస సినిమాలపై మరింత ఆసక్తి నెలకుంటుంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో మూడు నుంచి నాలుగు చిత్రాలు లైన్ అప్ లో ఉండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో .. ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్ గురించి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.

వరుస పరాజయాల తర్వాత.. ప్రశాంత్ నీల్ కారణంగా డార్లింగ్ ప్రభాస్ భారీ విజయాన్ని చూసిన మాట వాస్తవమే. ఇండస్ట్రీలో తనదైన విభిన్నమైన కథలతో .. అంతే విభిన్నంగా సినిమాను చిత్రీకరించడంలో.. ప్రశాంత్ నీల్ ను మించిన వారు ఎవరు ఉండరు. ఇప్పటికే ఈ దర్శకుడు తీసిన కేజీఎఫ్ పార్ట్ 1,2 , సలార్ పార్ట్ 1 చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. అలాగే సలార్ చిత్రం మరో పార్ట్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం. సలార్ పార్ట్-1 ఏ ఈ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. ఇక ప్రశాంత్ నీల్ పార్ట్ -2 లో ఎటువంటి ప్రభాస్ ను చూపిస్తాడా అని .. అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే స్పెషల్ మార్క్ ఉంది. మరి, వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటే ఎలా ఉంటుంది. అసలు ఆ ఊహకే అందరికి హైప్ క్రియేట్ అయిపోతుంది. ఇలానే సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ , ప్రభాస్ తో కలిసి మరో సినిమా తీయబోతున్నాడంటూ.. ఆ సినిమా పేరు “రావణం” అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం వినిపించే కథనాలలో ఏ మేరకు నిజం ఉంది అనేది క్లారిటీ లేదు. కానీ, ఒకవేళ నిజం అయితే మాత్రం.. ఇండస్ట్రీలో ప్రభాస్ ఖాతాలో మరో భారీ విజయం పడినట్టే అవుతుందని చెప్పి తీరాలి. ప్రస్తుతానికి ఈ న్యూ ప్రాజెక్ట్ పై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ , సలార్ -2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అభిమానులు డార్లింగ్ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , ఫస్ట్ లుక్స్ తో ఈ చిత్రాలపైన భారీ అంచనాలు నెలకుంటున్నాయి . ఇక రాబోయే రోజుల్లో వీటిపై ఎటువంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి, ప్రశాంత్ నీల్ , ప్రభాస్ కాంబినేషన్ లో మరో చిత్రం అంటూ .. వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet