iDreamPost
android-app
ios-app

జవాన్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ. 120 కోట్లు! అయినా విన్నర్ ఆదిపురుషే..

  • Author ajaykrishna Published - 01:34 PM, Fri - 8 September 23
  • Author ajaykrishna Published - 01:34 PM, Fri - 8 September 23
జవాన్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ. 120 కోట్లు! అయినా విన్నర్ ఆదిపురుషే..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. దాదాపు చాలా ఏళ్లుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న షారుఖ్.. పఠాన్ తో ఏకంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. పఠాన్ వెయ్యి కోట్లు వసూల్ చేసేసరికి అందరి దృష్టి జవాన్ పై పడింది. దర్శకుడు అట్లీ రూపొందించిన జవాన్ కూడా.. పఠాన్ కి మించి హైప్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అనిరుధ్ సాంగ్స్, జికే విష్ణు విజువల్స్.. నయనతార – దీపికా పదుకొనే గ్లామర్.. విజయ్ సేతుపతి విలనిజం.. ఇవన్నీ కాకుండా షారుఖ్ డ్యూయెల్ రోల్. ఇన్ని క్రేజీ పాయింట్స్ తో జవాన్ తెరపైకి వచ్చింది.

ఇక విడుదలైన ఫస్ట్ డే మొదటి షోస్ నుండే జవాన్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగాను బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. కింగ్ ఖాన్ సత్తాను చాటుతూ.. జవాన్ ఫస్ట్ డే ఏకంగా రూ. 120 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇది షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కాగా.. ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ హీరో ఈ రికార్డు నమోదు చేయలేదని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే.. ఇప్పుడు టాప్ 2లో ఉన్న రెండు బిగ్గెస్ట్ బాలీవుడ్ ఓపెనింగ్స్ జవాన్(70 కోట్ల net), పఠాన్(57 కోట్ల నెట్) షారుఖ్ పేరిట ఉండటం విశేషం. అయినా సరే.. నాన్ బాలీవుడ్ హీరో రికార్డును జవాన్ టచ్ కూడా చేయలేకపోయిందని సినీవర్గాల టాక్.

అదెలాగంటే.. ఈ ఏడాది ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ.. మొదటి రోజు ఏకంగా రూ. 140 కోట్లు వసూల్ చేసింది. దీంతో ఈ ఏడాది 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు ఇంకా ప్రభాస్ ఆదిపురుష్ చేతిలోనే ఉంది. ప్రభాస్ బాలీవుడ్ హీరో కాదు.. షారుఖ్ పఠాన్ రికార్డు బ్రేక్ చేయగలిగాడు. కానీ.. నాన్ బాలీవుడ్ హీరో ప్రభాస్ రికార్డుని జవాన్ టచ్ కూడా చేయలేకపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే రెస్టాఫ్ డేస్ జవాన్ అద్భుతమైన నెంబర్స్ నమోదు చేయనుందని అర్ధమవుతుంది. మరి జవాన్, ఆదిపురుష్ ల ఓపెనింగ్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by FILMY BOWL (@filmybowl)

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş