iDreamPost
android-app
ios-app

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు 35000 మంది! ఇదెలా సాధ్యం ?

  • Published Sep 24, 2024 | 11:54 AM Updated Updated Sep 24, 2024 | 11:54 AM

Devara Movie: సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే హైప్ ఉంటుంది. కానీ ఈ రేంజ్ హైప్ చూసి మాత్రం చాలా కాలమే అయిందని చెప్పి తీరాలి. ఫ్యాన్స్ కు తారక్ మీద ఉన్న అభిమానమే జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Devara Movie: సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే హైప్ ఉంటుంది. కానీ ఈ రేంజ్ హైప్ చూసి మాత్రం చాలా కాలమే అయిందని చెప్పి తీరాలి. ఫ్యాన్స్ కు తారక్ మీద ఉన్న అభిమానమే జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

  • Published Sep 24, 2024 | 11:54 AMUpdated Sep 24, 2024 | 11:54 AM
దేవర ప్రీ రిలీజ్  ఈవెంట్ కు 35000 మంది! ఇదెలా సాధ్యం ?

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ఊరికే పేరు వస్తుందా.. ఏ రేంజ్ లో ఎన్టీఆర్ మాస్ యాక్షన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తే కానీ ఈ పేరు రాదు. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కసిగా కష్టపడుతూనే వచ్చాడు. ప్రతి సినిమాలోనూ తనదైన మాస్ లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. అప్పట్లో వచ్చిన ఆంధ్రావాలా , సింహాద్రి సినిమాలతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటినుంచి కూడా తారక్ మాస్ యాక్షన్స్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక సాధారణంగానే తారక్ సినిమాలకు హైప్ ఉంటుంది. కానీ ఇప్పుడు దేవర విషయంలో ఉన్న హైప్ లో మాత్రం ఎదో మ్యాజిక్ ఉంది. తారక్ మీద ప్రేక్షకులకు ఉన్న అభిమానమే.. జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

తమ అభిమాన హీరో ఆడియో ఫంక్షన్ కైనా లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా ఆడియన్స్ రావడం సహజం. వేల మంది జనం కేరింతలు, ఈలలు గోళాలతో ఆ ఈవెంట్ కు కళ తెప్పిస్తారు. హద్దులు దాటిన తమ అభిమానాన్ని కనబరుస్తారు. కానీ అలాంటి అభిమానం వలన ఏకంగా ఒక ఈవెంట్ ఏ క్యాన్సిల్ అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. సుమారు 35 వేల మంది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారని అంచనా. దీనితో ఆ క్రౌడ్ ను మైంటైన్ చేయలేక ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. దీనిపై తారక్ ఫ్యాన్స్ మండిపడ్డారు.. చాలానే హడావిడి జరిగింది. అదంతా తెలిసిన విషయమే. అసలు అంత మంది రావడం ఎలా సాధ్యం అని ఇప్పుడు దీని గురించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అలాంటి డిస్కషన్స్ పెట్టడంలో తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి అభిమానం కేవలం తారక్ కు మాత్రమే సొంతం. ఇక దేవర విషయంలో ఇలాంటి హైప్ కొనసాగడానికి కూడా కారణాలు లేకపోలేదు.

నిజమే ప్రేక్షకులు ఒక్కసారి ఒక హీరోను అభిమానించారంటే.. ఏదేమైనా సరే ఆ హీరో సినిమాలను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. తారక్ విషయంలో కూడా అదే జరిగింది. తారక్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఇష్టపడేది అతనిలో మాస్ ఎలిమెంట్ నే. ఇదే ఇండస్ట్రీలో తారక్ స్టాండర్డ్స్ ను మైంటైన్ చేస్తుంది. అప్పటిలో వచ్చిన సింహాద్రి , ఆంధ్రావాలా లాంటి సినిమాలు ఫ్యాన్స్ కు కిక్కెకించాయి. ఆ తర్వాత తారక్ ఎలాంటి సినిమాలను తీసినా.. అది బావున్నా లేకున్నా ఫ్యాన్స్ హిట్ చేస్తూనే వచ్చారు. ఇది ఏ హీరోకైనా సహజమే . అయితే ఇప్పుడు దేవర హైప్ వెనుక మ్యాజిక్ కు కారణం.. మళ్ళీ అభిమానులు కోరుకున్న మాస్ ఎలిమెంట్స్ ను చూపించడమే. ఇన్నాళ్లకు వారికి కావాల్సిన తారక్ నట విశ్వరూపాన్ని దేవరలో చూడడంతో.. ఇప్పుడు ఇలాంటి హైప్ కొనసాగుతుంది. అందుకే తాము కోరుకున్న ఎన్టీఆర్ ను ఓసారైనా చూడాలనే ఉద్దేశంతోనే ఎక్కడెక్కడి నుంచో అంతమంది అభిమానులు తరలి వచ్చారు. మరోసారి ఈ ఇన్సిడెంట్ తో తారక్ నిజంగానే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మరి దేవర రిలీజ్ తర్వాత ఇంకా ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.