iDreamPost
android-app
ios-app

కొన్ని తప్పులు జరిగాయి! పవిత్రపై నరేష్ కొడుకు షాకింగ్ కామెంట్స్!

  • Author singhj Published - 06:21 PM, Wed - 23 August 23
  • Author singhj Published - 06:21 PM, Wed - 23 August 23
కొన్ని తప్పులు జరిగాయి! పవిత్రపై నరేష్ కొడుకు షాకింగ్ కామెంట్స్!

సెలబ్రిటీలకు అందులోనూ సినీ ప్రముఖులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మూవీ స్టార్స్ చేసే సినిమాలతో పాటు వారి వ్యక్తిగత జీవితంలోని విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందిలో ఉండటం సహజమే. నటుల లవ్ స్టోరీస్​కు సంబంధించిన గాసిప్స్, రూమర్స్​ బాగా వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్​ల వ్యవహారం టాలీవుడ్​లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడవడం, అందులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వల్ల ఎలాంటి వివాదం చెలరేగిందో అందరూ చూశారు.

నరేష్-పవిత్రల ప్రేమ వ్యవహారంపై ‘మళ్లీ పెళ్లి’ అనే ఒక సినిమా కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నరేష్, పవిత్రలు ప్రధాన పాత్రల్లో నటించారు. వీళ్ల లవ్ ఎఫైర్ వివాదాలతోనే సాగుతోంది. ఇటీవలే రమ్య రఘుపతి విషయంలో నరేష్​కు కోర్టు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఆయన వ్యవహారాల్లో రమ్య అసలు జోక్యం చేసుకోకూడదని కోర్టు తీర్పును ఇచ్చింది. కాగా, రమ్యతో కాంట్రవర్సీ, పవిత్రా లోకేష్​​తో లవ్ ఎఫైర్ లాంటి వాటితో నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటిది ఆయన కుమారుడు నవీన్ కృష్ణ షార్ట్ ఫిల్మ్స్​తో దర్శకుడిగా మారారు. ఇటీవలే నవీన్ కృష్ణ తన స్నేహితుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్​తో కలసి ‘సత్య’ అనే వీడియో సాంగ్ రూపొందించారు. ఈ పాటతో నవీన్​కు మంచి గుర్తుంపు దొరికింది.

‘సత్య’ సాంగ్ ప్రమోషన్స్​లో తన తండ్రి నరేష్ గురించి నవీన్ కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్​ అవుతున్నాయి. తన కుటుంబంలో జరుగుతున్న సంఘటనల మీద రెండు రకాలుగా నవీన్ కామెంట్స్ చేశారు. తప్పలు జరిగాయని చెప్పిన నవీన్ కృష్ణ.. తన తండ్రికి మద్దతుగా నిలిచారు. తమ కుటుంబంలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారని నవీన్ తెలిపారు. తమ ఫ్యామిలీ గురించి ఎవరు ఎన్ని విధాలుగా వాగినా పట్టించుకోలేదన్నారు. నాన్న నరేష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదన్న నవీన్.. ఆయన సంతోషంగా ఉన్నారా లేదా అనేదే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పవిత్రా లోకేష్​తో తనకు పరిచయం ఉందన్న నవీన్ కృష్ణ.. ఆమె చాలా మంది వ్యక్తి అని తెలిపారు. ఆమెను తాను పవిత్ర గారని పిలుస్తానని నవీన్ చెప్పుకొచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet