iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారంపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంచనాలు అమాంతం పెంచేశాడు!

  • Published Aug 28, 2024 | 12:04 PM Updated Updated Aug 28, 2024 | 12:16 PM

Nani Comments On Saripodhaa Sanivaaram Movie: ఆగస్ట్ నెలలో థియేటర్ లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ నెలలో ఆఖరిగా రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ.. తాజాగా నాని ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Nani Comments On Saripodhaa Sanivaaram Movie: ఆగస్ట్ నెలలో థియేటర్ లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ నెలలో ఆఖరిగా రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ.. తాజాగా నాని ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 28, 2024 | 12:04 PMUpdated Aug 28, 2024 | 12:16 PM
సరిపోదా శనివారంపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంచనాలు అమాంతం పెంచేశాడు!

నాని నుంచి ఏ సినిమాలు వస్తున్నా కానీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కథలన్నీ కూడా ప్రేక్షకుల హృదయాలను కదిలించే విధంగా.. ఎంతో సహజంగా ఉంటూ ఉంటాయి. అందుకేనేమో నానిని న్యాచురల్ స్టార్ అని అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సరిపోదా శనివారం. ఆల్రెడీ ఈ దర్శకుడితో.. అంటే సుందరానికి అనే క్యూట్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించారు. ఇక ఇప్పుడు కంప్లీట్ మాస్ యాక్షన్స్ తో.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలో తాజాగా నాని ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

నాని ఏ సినిమా తీసినా కానీ.. కచ్చితంగా అందులో ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని.. ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలో నాని , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రాబోతున్న.. సరిపోదా శనివారం.. ఈ నెలలో రిలీజ్ కాబోయే సినిమాలలో ఆఖరి మూవీ.. ఇప్పటికే రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలు.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో ఇప్పుడు సరిపోదా శనివారంపై అందరికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు ఏకంగా నాని లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘మై షో ఈజ్ డన్.. అవర్ షో బిగిన్స్ టుమారో’ అంటూ టైటిల్ కార్డ్స్ పడుతున్న వీడియో ను పోస్ట్ చేశాడు. సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో.. ఈ పోస్ట్ చూసిన తర్వాత అందరిలో సినిమా ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ ఇంకాస్త పెరిగిపోయింది.

ఈ మూవీ అనౌన్స్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసిన దగ్గర నుంచి .. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూనే వచ్చింది. మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది.. ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందు ఏర్పడుతున్న అంచనాలు.. రిలీజ్ తర్వాత ఉండడంలేదు. ఒకవేళ నాని మూవీ కనుక అంచనాలు నిలబెట్టుకుంటే మాత్రం.. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో.. ఒవర్సిస్ ప్రీమియర్ షోల టికెట్ల విషయంలో భారీ బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తర్వాత ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş