iDreamPost
android-app
ios-app

Nani: నాని కోసం కోలీవుడ్ డైరెక్టర్స్ క్యూ.. ఆఫర్లకు నో చెప్పాలంటున్న ఫ్యాన్స్!

  • Published Dec 14, 2023 | 10:07 PM Updated Updated Dec 14, 2023 | 10:07 PM

‘హాయ్ నాన్న’తో మరో హిట్​ను అకౌంట్​లో వేసుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. అలాంటి ఆయనతో సినిమా తీయాలని తెలుగుతో పాటు తమిళ దర్శకులు కూడా ప్రయత్నిస్తున్నారు.

‘హాయ్ నాన్న’తో మరో హిట్​ను అకౌంట్​లో వేసుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. అలాంటి ఆయనతో సినిమా తీయాలని తెలుగుతో పాటు తమిళ దర్శకులు కూడా ప్రయత్నిస్తున్నారు.

  • Published Dec 14, 2023 | 10:07 PMUpdated Dec 14, 2023 | 10:07 PM
Nani: నాని కోసం కోలీవుడ్ డైరెక్టర్స్ క్యూ.. ఆఫర్లకు నో చెప్పాలంటున్న ఫ్యాన్స్!

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఫుల్​ జోష్​లో ఉన్నారు. ఆ మధ్య సరైన హిట్లు లేక ఇబ్బంది పడిన ఆయన.. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు దక్కడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు నాని. రెగ్యులర్ స్టోరీస్​కు కాస్త భిన్నంగా ఉండేలా సినిమాలను ప్లాన్ చేసుకునే నాని మళ్లీ ఫామ్​లోకి రావడంతో ఇంకా వెరైటీ ఫిల్మ్స్​ను ఆయన నుంచి ఆశిస్తున్నారు అభిమానులు. న్యాచులర్ స్టార్ నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు వస్తాయోనని.. ఏ ప్రాజెక్ట్​కు ఆయన ఓకే చెబుతారో తెలుసుకోవాలని ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన తదుపరి చిత్రాల గురించి సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.

నాని మాత్రం ప్రస్తుతం నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్​లో వస్తున్న ఈ ఫిల్మ్​ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ కోసం బడ్జెట్​ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట. ఇదిలా ఉంటే.. నాని కోసం తమిళ దర్శకులు క్యూ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘దసరా’ లాంటి ఊరమాస్ సినిమాతో, ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామాతోనూ హిట్స్ కొట్టిన నానితో ఎలాగైనా ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవాలని కొందరు కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

తమిళం నుంచి న్యాచురల్ స్టార్​ను ముందుగా కలిసింది శిబి చక్రవర్తి. శివ కార్తికేయన్​తో ‘కాలేజీ డాన్’తో తెలుగు నాట కూడా హిట్ కొట్టిన ఆయన నానికి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. అయితే బడ్జెట్ విషయంలోనే సమస్య వచ్చిందని టాక్. మూవీకి రూ.100 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో నిర్మాతలు వెనకడుగు వేశారట. నానితో శిబి చక్రవర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ డ్రాప్ అయిందని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో ఈ ప్లేస్​ను భర్తీ చేసేందుకు మరో తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ప్రయత్నిస్తున్నారట. న్యాచులర్ స్టార్ కోసం ఒక సబ్జెక్ట్​ను తయారు చేశారట. కార్తీక్ నెరేషన్ రెగ్యులర్ మూవీస్ కంటే ఎంతో డిఫరెంట్​గా ఉంటుందనేది తెలిసిందే.

తెలుగు ఆడియెన్స్​కు కార్తీక్ సుబ్బరాజ్ మూవీస్ అంతగా కనెక్ట్ కాలేదు. ఒక్క ‘పిజ్జా’ సినిమా తప్పితే ఇక్కడ పెద్దగా ఆడిన చిత్రాలేవీ లేవు. రజినీకాంత్ ‘పేట’ యావరేజీగా నిలిచింది. రీసెంట్​గా వచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ ఫిల్మ్ ‘జిగర్​తాండ డబుల్ ఎక్స్’ తమిళంలో సూపర్ హిట్టయినా.. తెలుగులో మాత్రం డిజాస్టర్​గా నిలిచింది. దీంతో ఆయనతో సినిమా వద్దని​ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు నాని ఫ్యాన్స్ కూడా కార్తీక్​తో ఫిల్మ్ చేయొద్దని కోరుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అవడం కష్టంగానే కనిపిస్తోంది. మరి.. నాని-కార్తీక్ సుబ్బరాజ్ కాంబోపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Salaar: ట్రైలర్​లో చేసిన తప్పే రిపీటైతే కష్టమే.. ప్రశాంత్ నీల్ గుర్తించాడా..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss