iDreamPost

Salaar: ట్రైలర్​లో చేసిన తప్పే రిపీటైతే కష్టమే.. ప్రశాంత్ నీల్ గుర్తించాడా..?

  • Published Dec 14, 2023 | 9:36 PMUpdated Dec 14, 2023 | 9:36 PM

‘సలార్’ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్స్​లోకి వచ్చేయనుంది.

‘సలార్’ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్స్​లోకి వచ్చేయనుంది.

  • Published Dec 14, 2023 | 9:36 PMUpdated Dec 14, 2023 | 9:36 PM
Salaar: ట్రైలర్​లో చేసిన తప్పే రిపీటైతే కష్టమే.. ప్రశాంత్ నీల్ గుర్తించాడా..?

ఈ ఏడాది కొన్ని సినిమాలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. సంవత్సరం మొదట్లో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ హవా నడిచింది. బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్స్​తో ఈ మూవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత తలైవా రజినీకాంత్ యాక్ట్ చేసిన ‘జైలర్’, దళపతి విజయ్ ‘లియో’ చిత్రాలు హల్​చల్​ చేశాయి. ఈ రెండు సినిమాలు వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్​ను షేక్ చేశాయి. ఆ తర్వాత కింగ్ ఖాన్ నుంచి వచ్చిన మరో మూవీ ‘జవాన్’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ‘పఠాన్’తో పోటాపోటీగా కలెక్షన్స్ సాధించిందీ ఫిల్మ్. ఒకే ఏడాదిలో రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్​తో షారుక్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక, ఈ మధ్య వచ్చిన రణ్​బీర్ కపూర్ ‘యానిమల్’ అయితే సెన్సేషనల్ హిట్​గా నిలిచింది. పైసినిమాలు అన్నీ కూడా నాలుగైదు భాషల్లో విడుదలై అన్ని చోట్ల బాగా వసూలు చేసినవే కావడం విశేషం.

ఈ ఏడాది ఆఖర్లో మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా దేశంలోని మూవీ లవర్స్ అంతా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఒకటి ‘సలార్’. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఫిల్మ్​కు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్నారు. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియెన్స్​ ఎక్స్​పెక్టేషన్స్​ను మరింతగా పెంచేశాయి. ఎలాంటి ప్రమోషనల్ వీడియోలు, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లాంటివి లేకుండానే ‘సలార్’ మీద బజ్​ ఆకాశాన్ని అంటేలా చేశారు ప్రభాస్-ప్రశాంత్ నీల్. వీళ్ల కాంబోలో మూవీ కాబట్టే ఈ రేంజ్​లో ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు.

‘సలార్’ ఫైనల్ కట్ వెర్షన్​కు సెన్సార్ కూడా అయిపోయింది. ఈ మూవీ డ్యూరేషన్ 177 మినిట్స్ అని తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఫైనల్ వెర్షన్​లో మరిన్ని యాక్షన్ సీన్స్​ను నీల్ మామ యాడ్ చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ట్రైలర్ విషయంలో పలు నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ‘సలార్’ ట్రైలర్​లో పలు చోట్ల లిప్​ సింక్​ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్, పోస్టులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఇదే తప్పు మళ్లీ సినిమాలోనూ రిపీటైతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఫైనల్ కట్ సెన్సార్ పూర్తయిందని తెలుస్తోంది. కాబట్టి అందులో లిప్ సింక్ అంశాన్ని నీల్ మామ సరిచేశాడో లేదో రిలీజ్ రోజునే తేలనుంది. మరి.. ‘సలార్’ ట్రైలర్​లో లిప్ సింక్ విషయంలో మీరేమైనా తప్పుల్ని గమనించినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘ఓ మై బేబీ’ సాంగ్ పై ట్రోల్స్! రచయత సీరియస్ వార్నింగ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి