iDreamPost
android-app
ios-app

బన్నీతో యుద్ధానికి రెడీ అవుతున్న బాలయ్య! బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..

  • Published Aug 28, 2024 | 4:28 PM Updated Updated Aug 28, 2024 | 4:28 PM

Allu Arjun, Nandamuri Balakrishna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఢీ కొట్టేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి. ఇదే జరిగితే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Allu Arjun, Nandamuri Balakrishna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఢీ కొట్టేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి. ఇదే జరిగితే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 28, 2024 | 4:28 PMUpdated Aug 28, 2024 | 4:28 PM
బన్నీతో యుద్ధానికి రెడీ అవుతున్న బాలయ్య! బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప2’. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం.. పుష్పరాజ్ ను ఢీ కొనేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ-బాలయ్య కాంబోలో ఓ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీని తొలుత సంక్రాంతికి బరిలో దింపాలని మేకర్స్ భావించారు. కానీ సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ సినిమాలు ఉండటంతో.. మేకర్స్ ముందే రావాలని ఆలోచనలు చేస్తున్నారు. దాంతో బన్నీతో బాలయ్య ఢీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీని సంక్రాంతి బరిలోకి ముందుగా దింపాలనుకున్నారు. కానీ.. ఆ సమయానికి పోటీ అధికంగా ఉండటంతో.. అంతకంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాలని మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘అఖండ’ మూవీని డిసెంబర్ 2న రిలీజ్ చేశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యి.. అదే రోజున బాలయ్య-బాబీ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సెంటిమెంట్స్ ను ఎక్కువగా నమ్మే బాలయ్య ఇందుకు ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదు.

AA vs NBK

అయితే డిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ ల పుష్ప 2 విడుదల కాబోతోంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఇద్దరి మధ్య యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వైపు బన్నీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరో వైపు బాలయ్య నుంచి అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.రెండు సినిమాలు ఒకేసారి వస్తే.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. ఈ విషయానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. మరి బాలయ్య-బన్నీ ఒకేసారి వస్తే.. థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş