iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ 14 కంటెస్టెంట్స్ వీళ్లే!

  • Published Aug 28, 2024 | 12:39 PM Updated Updated Aug 28, 2024 | 12:45 PM

Bigg Boss Telugu Season 8 Final Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి పెద్ద సమయం లేదు. ఇంకా మూడ్రోజుల్లో షో స్టార్ట్ కాబోతోంది. మరి.. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 ఫైనల్ 14 కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.

Bigg Boss Telugu Season 8 Final Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి పెద్ద సమయం లేదు. ఇంకా మూడ్రోజుల్లో షో స్టార్ట్ కాబోతోంది. మరి.. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 ఫైనల్ 14 కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.

  • Published Aug 28, 2024 | 12:39 PMUpdated Aug 28, 2024 | 12:45 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ 14 కంటెస్టెంట్స్ వీళ్లే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరిగ్గా మూడ్రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 1, రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ లో కూడా గత సీజన్ తాలుకూ మెరుపులు కనిపిస్తాయి అని.. నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే బిగ్ బాస్ కల్ట్ ఫ్యాన్స్ లో కూడా ఎందుకో ఈ సీజన్.. గత సీజన్ 7 కంటే బాగా క్లిక్ అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఎందుకు అంటున్నారు అంటే.. పరిస్థితులు, వాళ్లు ఇస్తున్న అప్ డేట్స్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ తీసుకుంటున్న డెసిషన్స్ చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. వాటిలో ఫైనల్ లిస్ట్ ఒకటి రెడీ అయిపోయింది. మరి.. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్:

ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి చాలానే పేర్లు వినిపించాయి. వాటిలో ఇప్పుడు ఒక ఫైనల్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి హౌస్ లోకి ఒకేసారి 14 మంది కంటెస్టెంట్స్ ని పంపిచంబోతున్నారు అని తెలుస్తోంది. ఆ 14 మందిలో చాలానే ఇంట్రెస్టింగ్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునే పేర్లు కచ్చితంగా వెళ్లే వాళ్లు అని బలంగా చెప్పలేం. ఎందుకంటే అలా చెప్పకూడదు. కానీ, వీళ్లని మాత్రం హౌస్ లో చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ చూస్తే.. టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం. ఈయన పేరు బాగా ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపుగా ఖరారు కూడా అయ్యింది అనుకోవాలి. ఆయన హౌస్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడని చెబుతున్నారు.

తర్వాత అలీ సోదరుడు ఖయ్యూమ్. ఈయన కూడా కచ్చితంగా వెళ్లే వాళ్ల లిస్ట్ లో ఉంది. ఆ తర్వాత బాగా వినిపిస్తున్న పేరు రీతూ చౌదరి. అయితే రీతూ ముందే హౌస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. రీతూని వైల్డ్ కార్డ్ పంపుతారని చెబుతున్నారు. ఇంక యాంకర్ విష్ణుప్రియ మాత్రం మొదటి గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ లోనే హౌస్ లోకి వెళ్లిపోతుంది. విష్ణుప్రియ- రీతూ చౌదరి బిగ్ బాస్ కి వెళ్తున్న విషయాన్ని చెప్పకనే ఒక వీడియోలో చెప్పారు. వీళ్ల తర్వాత ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పేరు.. ఎక్కువ మంది బిగ్ బాస్ కి వెళ్లాలి అని కోరుకుంటున్న పేరు ఆర్జే శేఖర్ బాషా. రాజ్ తరుణ్- లావణ్య ఇష్యూతో ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యింది. ఈయన కూడా కన్ఫార్మ్డ్ కంటెస్టెంట్ అని తెలుస్తోంది. సోషల్ మీడియా నుంచి బెజవాడ బేబక్క కూడా దాదాపుగా కన్ఫామ్డ్ కంటెస్టెంట్ అని చెబుతున్నారు.

Biggboss8

ఇంక బుల్లితెర హీరో నిఖిల్ మలియక్కల్ పేరు బాగా ఆసక్తిని నెలకొల్పుతోంది. ఎందుకంటే బుల్లితెర షోస్ లో ఈయన బాగా ఫేమస్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. అగ్రెసివ్ గా టాస్కులు ఆడతాడు. డ్యాన్సర్ నైనికా కూడా బిగ్ బాస్ 8కి వస్తోంది. అలాగే యూట్యూబర్, బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత కూడా బిగ్ బాస్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ గా ఉంది. టాలీవుడ్ హీరోయిన్ విస్మయశ్రీ కూడా బిగ్ బాస్ కి వెళ్తోంది. ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా నేను కొన్నిరోజులు అందుబాటులో ఉండను.. మీ సపోర్ట్ కావాలి అని హింట్ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో అభీరామ్ వర్మ కూడా బిగ్ బాస్ కి వెళ్తున్నాడు. ఇతను చిన్న చిన్న సినిమాలు చేశాడు. కానీ, సరైన గుర్తింపు అయితే దక్కలేదు. బుల్లితెర ఆర్టిస్ట్ నాగమణికంఠ పేరు కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఈయన కూడా బిగ్ బాస్ 8కి వెళ్తున్నాడు. ఈ లిస్ట్ మొత్తం పక్కన పెడితే రాకింగ్ రాకేశ్ పేరు కూడా అనూహ్యంగా లిస్ట్ లోకి వచ్చింది. అది ఎంతవరకు ఓకే అవుతుంది అనేది చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ లిస్ట్ దాదాపుగా వచ్చే వాళ్లే కాకపోతే ఇప్పుడే మనం కన్ఫామ్ చేసి చెప్పకూడదు. మరి.. ఈ లిస్ట్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş