Nidhan
‘కల్కి 2898 ఏడీ’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన అకౌంట్లో వేసుకున్నారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ మూవీ రూ.1,000 కోట్లను కలెక్ట్ చేసే దిశగా దూసుకెళ్తోంది.
‘కల్కి 2898 ఏడీ’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన అకౌంట్లో వేసుకున్నారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ మూవీ రూ.1,000 కోట్లను కలెక్ట్ చేసే దిశగా దూసుకెళ్తోంది.
Nidhan
‘కల్కి 2898 ఏడీ’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన అకౌంట్లో వేసుకున్నారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ మూవీ రూ.1,000 కోట్లను కలెక్ట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. రిలీజ్ డే మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. వీక్ డేస్‌లో కూడా అదిరిపోయే రేంజ్లో వసూళ్లు ఉన్నాయి. ఇదే ఊపును కొనసాగిస్తే మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ‘కల్కి’ కలెక్షన్స్‌తో పాటు మూవీలోని మెయిన్ క్యారెక్టర్లు, అలాగే కామియోస్ గురించి కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వైజయంతీ మూవీస్‌లో చేసిన అందరు హీరోలు ఈ ఫిల్మ్‌లో ఏదో ఒక రోల్లో ఇలా కనిపించి అలా మాయమయ్యారు.
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, కేవీ అనుదీప్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్.. ఇలా చాలా మంది ‘కల్కి’లో అలరించారు. అయితే ఇంతమంది యాక్ట్ చేసినా ఇద్దరు హీరోలు మాత్రం మూవీలో కనిపించలేదు. నాగ్ అశ్విన్ ఫస్ట్ ఫిల్మ్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నటించిన న్యాచురల్ స్టార్ నానితో పాటు వైజయంతీ ప్రొడక్షన్లో వచ్చిన ‘జాతిరత్నాలు’లో యాక్ట్ చేసిన నవీన్ పొలిశెట్టి మాత్రం ‘కల్కి’లో మిస్ అయ్యారు. చిన్నదో పెద్దదో వీళ్ల స్క్రీన్ ప్రెజన్స్ కూడా ఉంటే ఆడియెన్స్ ఇంకా ఎంజాయ్ చేసేవారు. అయితే వీళ్లిద్దరూ పార్ట్-2లో ఉంటారని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. వైజయంతీ మూవీస్‌లో చేసిన అందరు హీరోలు కనిపించారని.. వీళ్లిద్దరే మిస్ అయ్యారని అన్నారు.
నాని-నవీన్ పొలిశెట్టిని ‘కల్కి 2’లో ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేస్తానని చెప్పారు నాగ్ అశ్విన్. పార్ట్-1లో ప్రభాస్ పాత్ర నిడివి తగ్గిన మాట వాస్తవమేనని.. వరల్డ్ బిల్డింగ్ కోసం టైమ్ తీసుకోవడంతో ఇలా జరిగిందన్నారు. సినిమాలో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉండటంతో ప్రభాస్ పాత్రకు ఎక్కువ నిడివి దొరకలేదన్నారు. అయితే ‘కల్కి 2’లో మాత్రం ఆయన క్యారెక్టర్ చాలా సేపు ఉంటుందని స్పష్టం చేశారు నాగ్ అశ్విన్. ‘మాయాబజార్’ను స్ఫూర్తిగా తీసుకొని మహాభారతం ఆధారంగా ఈ సినిమాను రూపొందించానని ఆయన పేర్కొన్నారు. భైరవ పాత్రను సీరియస్‌గా కాకుండా ఫన్నీగా ఉండాలనే ఉద్దేశంతో అలా డిజైన్ చేశామని.. ఇంకా డార్క్‌గా చూపించాలని తాము అనుకోలేదన్నారు నాగ్ అశ్విన్. ‘కల్కి 2898 ఏడీ’ బ్రహ్మాండమైన విజయం సాధించడంతో మూవీ యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఇందులో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానాలు ఇచ్చారు. మరి.. ‘కల్కి 2’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.